నిన్న రెండు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ మీద దాడి చేశాయి. విక్రాంత్ రోణతో పాటుగా శరవణన్ ది లెజెండ్ థియేటర్లలో అడుగు పెట్టింది. సహజంగానే సుదీప్ మూవీకే అంతో ఇంతో బజ్ ఉన్నప్పటికీ లెజెండ్ ట్రైలర్ చూసిన జనాలకు అందులో మంచి ట్రోలింగ్ స్టఫ్ ఉందనే విషయం అర్థమైపోయింది. ఎనభై కోట్ల బడ్జెట్ తో భారీ టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకుని ఏదో సూపర్ స్టార్ మూవీ అన్నంత రేంజ్ లో ఖర్చు పెట్టిన శరవణన్ దీన్ని ఏకంగా ప్యాన్ ఇండియా లెవెల్ లో వివిధ భాషల్లో రిలీజ్ చేయడం పెద్ద ఝలక్.
ఆశించిన దానికన్నా చాలా ఎక్కువగా ది లెజెండ్ వినోదాన్ని పంచింది. అదేంటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అర్థం రివర్స్ లో చదువుకోవాలి. రజినీకాంత్ శివాజీ కథనే తిప్పి రాసుకుని హీరో పాత్రను డాక్టర్ కం సైంటిస్టుని చేసి దర్శకుడు జెడి జెర్రీ వీలైనంత త్వరగా జనం థియేటర్ల నుంచి పారిపోయేలా చేసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. శరవణన్ నటన ఇకపై యాక్టింగ్ స్కూల్స్ లోనూ ఉండొచ్చు. అసలు నటన ఎలా ఉండకూడదనే రెఫెరెన్స్ కోసం ఈ మూవీని ఫిలిం ఇన్స్ టిట్యూట్ లైబ్రరీలలో పొందుపరిచినా ఆశ్చర్యం లేదు.
మరీ ఇంత దారుణంగా ఉందా అంటే ఇక్కడ చెప్పింది చాలా తక్కువే. గ్రాండియర్ కు కావాల్సిన అన్ని అంశాలను సమకూర్చుకున్న శరవణన్ బృందం నిర్మాతే హీరో అయిన పాపానికి ఆయన ముచ్చట తీర్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది. గతంలో ఇతన్ని యాడ్స్ లో చూసిన జనం అవి కొన్ని సెకండ్లే కాబట్టి తట్టుకున్నారు. కానీ రెండున్నర గంటలపాటు డాల్బీ సౌండ్ లో బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే మాత్రం పాపం గుండె ధైర్యం సరిపోలేదు. మొత్తానికి సోషల్ మీడియాకు కావాల్సిన మెటీరియల్ ని లెజెండ్ పుష్కలంగా అందించేశాడు.
This post was last modified on July 29, 2022 9:49 am
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…