Movie News

ధ‌నుష్ మార్కులు కొట్టేశాడు

రాష్ట్రాల హ‌ద్దులు చెరిగిపోతున్నాయి. భాషా భేదం అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది. అన్ని భాష‌ల వాళ్లూ అన్ని సినిమాలూ చూసేస్తున్నారు. ప్రాంతీయ సినిమా రోజు రోజుకూ పెద్ద‌ద‌వుతోంది. హీరోల మార్కెట్ ప‌రిధి విస్త‌రిస్తోంది. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ బ‌హు భాషా చిత్రాలు చేయ‌డ‌మే కాక‌.. ఆయా భాష‌ల్లో సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు హీరోలు.

ఆర్ఆర్ఆర్ కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ మ‌ల‌యాళంలో త‌ప్ప మిగ‌తా ప్ర‌ధాన భాష‌ల‌న్నింట్లో సొంత వాయిస్‌తో స్ప‌ష్టంగా డైలాగ్స్ చెప్ప‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌మిళ స్టార్ల‌లో క‌మ‌ల్ హాస‌న్, సూర్య‌, కార్తి లాంటి వాళ్లు ఇప్ప‌టికే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవ‌డం తెలిసిందే. ఐతే మిగ‌తా హీరోల‌కు అది చాలా క‌ష్ట‌మైన విషయంగా అనిపించి ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కానీ ఇప్పుడు ధ‌నుష్ ఈ జాబితాలో చేరుతున్నాడు.

ఇప్ప‌టికే డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన ధ‌నుష్‌.. ఇప్పుడు నేరుగా సార్ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రం త‌మిళం, తెలుగులో ఒకే సారి తెరకెక్కుతోంది. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఇక్క‌డి బేన‌ర్ అయిన సితార ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

గురువారం ధ‌నుష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సార్ టీజ‌ర్ లాంచ్ చేశారు. అందులో ధ‌నుష్ తెలుగు డైలాగుల‌ను స్ప‌ష్టంగా ప‌లికి ఆశ్చర్య‌ప‌రిచాడు. కొంత త‌మిళ ట‌చ్ ఉన్న‌ప్ప‌టికీ.. సాధ్య‌మైనంత మెరుగ్గానే డైలాగులు ప‌లికాడు. ఇప్ప‌టిదాకా ధ‌నుష్‌కు తెలుగులో అత‌డికి సెట్ట‌య్యే వాయిస్ ఉన్న ఆర్టిస్టుతోనే డ‌బ్బింగ్ చెప్పించేవారు. సార్ కోసం అలాగే ట్రై చేసి ఉండొచ్చు కానీ.. ఇది ప‌క్కా తెలుగు సినిమా, త‌మిళ అనువాద చిత్రం కాదు అనే ఫీల్ రావ‌డానికి ధ‌నుష్ క‌ష్ట‌ప‌డి డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లున్నాడు. ఈ ప్ర‌య‌త్నానికి మంచి మార్కులే ప‌డుతున్నాయి.

This post was last modified on July 29, 2022 9:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago