కొన్ని సినిమాలకు సాంగ్స్ చాలా ప్లస్ అవుతాయి. రిలీజ్ కి ముందు అంతో ఇంతో బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేది పాటలే. ఇప్పుడు ఆల్బంలో ఒక్క సాంగ్ హిట్టయితే చాలు సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. రామ్ -లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన వారియర్ కి కూడా బులెట్ సాంగ్ రిలీజ్ కి ముందు చాలా ప్లస్ అయ్యింది. ఆ సాంగ్ మిలియన్ వ్యూస్ తో మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. తీరా చూస్తే సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో ఆ సాంగ్ కోసం సినిమాకి వెళ్ళిన వారికి సైతం నిరాశ తప్పలేదు.
ఇప్పుడు బులెట్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. అంతే కాదు 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. అయితే సినిమా రిజల్ట్ తో సాడ్ గా ఉన్న యూనిట్ కి బులెట్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అనే గుడ్ న్యూస్ కిక్ ఇవ్వడం లేదు. కానీ రామ్ , దేవి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేసుకుంటున్నారు. నిజానికి దేవి ఈ మధ్య కాలం లో ఇచ్చిన బెస్ట్ సాంగ్ ఇది. రిలీజ్ కి ముందు రీల్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసేసింది. రామ్ -కృతి శెట్టి స్టెప్స్ కూడా ఆకట్టుకున్నాయి. రొటీన్ కంటెంట్ తో సినిమా తీసి అందులో ఇలాంటి సాంగ్ పెడితే ఏం లాభం ?
ఏదేమైనా వారియర్ టీం కొన్నేళ్ళ తర్వాత చెప్పుకోవాలంటే ఈ సాంగ్ ఒక్కటే మిగిలింది. కంటెంట్ గురించి ఏం మాట్లాడుకోవడానికి లేదు. డే వన్ ఓపెనింగ్స్ ఫరవాలేదు అనుకున్నా మ్యాట్నీ కే సినిమా చతికిల పడింది.
This post was last modified on July 28, 2022 10:27 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…