ఈ రోజుల్లో సినిమా తీయడం, రిలీజ్ చేయడం కంటే.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి బజ్ క్రియేట్ చేయడం సవాలుగా మారిపోతోంది. అంతకంతకూ థియేటర్లకు జనం దూరం అయిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. వారిని వెండి తెరల వైపు లాగడం కష్ట సాధ్యం అవుతోంది. సినిమాకు కొబ్బరి కాయ కొట్టినప్పటి నుంచి పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళ్లి, ప్రమోషన్ల పరంగా క్రేజీగా ఏదైనా చేస్తే తప్ప జనాన్ని థియేటర్ల వైపు ఆకర్షించడం అవ్వట్లేదు.
ఇలాంటి టైంలో అసలు సినిమా ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియనట్లుగా అంతా అవగొట్టేసి.. రెండు ఆకర్షణీయ ట్రైలర్లు కట్ చేసి జనంలోకి వదలడం ద్వారా మంచి బజ్ సంపాదించింది ‘బింబిసార’ టీం. ‘ఎంత మంచి వాడవురా’ లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ బాగా టైం తీసుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమా మేకింగ్ టైంలో అసలు సౌండే లేదు. ఈ చిత్రం గురించి అసలు జనానికి ఏమీ తెలియదు. సినిమా పూర్తి కావస్తున్న దశలో ఒక మోషన్ పోస్టర్ వదిలారు అంతే. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది.
ఐతే సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యాక నేరుగా ఒక బ్యాంగ్ బ్యాంగ్ ట్రైలర్ వదిలారు కొన్ని వారాల ముందు. ఒక కొత్త దర్శకుడితో ఫామ్‌లో లేని, మార్కెట్ దెబ్బ తిన్న హీరో సాహసోపేతంగా భారీ బడ్జెట్లో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా చేయడం.. విజువల్స్ గొప్పగా ఉండడం, కంటెంట్ ఆసక్తికరంగా తోచడంతో జనాలను ట్రైలర్ బాగానే ఎంటర్టైన్ చేసింది. సినిమా మీద అంచనాలు పెంచింది. మళ్లీ కొంచెం గ్యాప్ ఇచ్చి తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు. అది మరింత ఇంటెన్స్‌గా, ఆసక్తికరంగా ఉండడంతో బజ్ రెట్టింపైంది. అందరూ చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు ఈ ట్రైలర్ చూసి.
కళ్యాణ్ రామ్, వశిష్ఠ్ కలిసి ఏదో అద్భుతం చేశారన్న ఫీలింగ్ కలుగుతోంది. సినిమా ఓవరాల్‌గా ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈ చిత్రానికి ప్రి రిలీజ్ బజ్ అయితే బాగానే క్రియేట్ అంది. ఓపెనింగ్స్ వరకు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండడంతో, ఇప్పటికే సినిమా చూసిన అతను మాట్లాడేదాన్ని బట్టి హైప్ ఇంకా పెరగొచ్చు. ఆగస్టు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 28, 2022 2:22 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…