పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఇండస్ట్రీ పెద్దలు గత రెండు మూడు రోజులుగా జరుపుతున్న చర్చలు ఫలితాలు ఇచ్చే దిశగానే వెళ్తున్నాయి. ఆగస్ట్ 1 షూటింగుల బందు ఉండకపోవచ్చని నిర్మాత సి కళ్యాణ్ అంటున్నారు కానీ దాన్ని అందరి మాటగా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే ఇంకా నాలుగు రోజుల టైం ఉంది కాబట్టి ఆలోగా అన్ని కొలిక్కి రావోచ్చట. టికెట్ రేట్లు, వర్చువల్ ప్రింట్ చార్జీలు, పెర్సెంటేజీలతో పాటు ప్రొడ్యూసర్లు ఫోకస్ చేస్తున్న మరో ప్రధాన ఇష్యూ నాలుగు నుంచి పది వారాల మధ్య ఓటిటి గ్యాప్.
ఆరు కోట్ల బడ్జెట్ పైబడిన సినిమాలు డెబ్భై రోజుల తర్వాతే స్టీమింగ్ కు వెళ్లాలనేది ప్రధానంగా వినిపిస్తున్న నిర్ణయం. నిజానికిది చాలా ఎక్కువ. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా థియేటర్ లైఫ్ నెల దాటలేని ఇప్పటి పరిస్థితుల్లో దానికి ఇంత నిడివి ఇస్తే ఓటిటిలు తాము ఆఫర్ చేయాలనుకున్న మొత్తంలో భారీ కోత విధించడం ఖాయం. దాని వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. రిలీజ్ కు ముందే చేసుకునే ఒప్పందాల్లో మాత్రమే సదరు డిజిటల్ సంస్థలు ఎక్కువ సొమ్ములు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. లేదంటే కథ వేరుగా ఉంటుంది అప్పుడు వేసే కోత ఎంత ఉంటుందో ముందే చెప్పలేం. ఒక్కోసారి అదే మైనస్ అవ్వొచ్చు కూడా
ఉదాహరణలు ఓ పెద్ద సినిమాకు మూడు వారాల గ్యాప్ తో ఓ సినిమాకి 30 కోట్లు ఆఫర్ ఇచ్చిందనుకుందాం. ఫ్లాప్ అయినా సరే త్వరగా వచ్చేసిందన్న ఆసక్తితో ఆడియన్స్ భారీగా దాన్ని చూసేస్తారు. అలా కాకుండా రెండు నెలల తర్వాత అన్నారే అనుకోండి అప్పుడు సగమే ఇస్తా అనొచ్చు. ఇక్కడ నిర్మాత కోల్పోయే పదిహేను కోట్లు కేవలం బ్లాక్ బస్టర్ అయితేనే థియేటర్ నుంచి వెనక్కు వస్తాయి. ఫ్లాప్ టాక్ వస్తే ఉన్నదిపాయే సామెత తరహాలో అయిపోతుంది. ఇది కొంచెం క్లిష్టమైన సమస్యే. ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు అమలు చేసి అప్పుడు ఫలితాలను విశ్లేషించే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉంది. ఈ పరిణామాలన్నీ ఓటిటిలు గమనిస్తున్న మాట వాస్తవం.
This post was last modified on July 28, 2022 2:45 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…