రేపు విడుదల కాబోతున్న ఈగ సుదీప్ విక్రాంత్ రోనా గురించి తెలుగులో ఏ హడావిడి కనిపించడం లేదు. జాక్వలిన్ ఐటెం సాంగ్ రారా రక్కమ్మ ఛార్ట్ బస్టర్ అయినప్పటికీ కేవలం ఆ ఒక్క పాట కోసమే థియేటర్లకు వెళ్లే మూడ్ లో మన ప్రేక్షకులు లేరు. కర్ణాటకలో మాత్రం దీనికి భీభత్సమైన హైప్ నెలకొంది. రికార్డు స్థాయిలో కెజిఎఫ్ రేంజ్ లో థియేటర్ కౌంట్ అంతకంతా పెరుగుతోంది. మైసూర్ లో తెల్లవారుఝామున వేస్తున్న ప్రీమియర్ షోలకు ఒక్క టికెట్ దొరికితే ఒట్టనేలా అమ్మకాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
మిగిలిన భాషల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జునని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారు, టీజర్ కోసమే అఖిల్, రామ్ గోపాల్ వర్మలను పిలిచి హంగామా చేశాడు సుదీప్. కానీ అవేవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. త్రీడిలో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ మన పబ్లిక్ కి అంతగా రీచ్ అవ్వడం లేదు. సుదీప్ కి తెలుగులో పెద్ద ఇమేజ్ లేకపోవడమే ఈ లో బజ్ కి కారణం. బాహుబలి, సైరా నరసింహారెడ్డిలో చేసిన క్యామియోలు తన ఫాలోయింగ్ ని పెంచలేదు.
అసలు రామారావు ఆన్ డ్యూటీకే బుకింగ్స్ అంతంత మాత్రంగా ఉంటే ఇప్పుడీ విక్రాంత్ రోనా ఏదో అద్భుతం చేస్తుందని ఆశించలేం. కాకపోతే ఒక రోజు ముందు గురువారమే వస్తుంది కాబట్టి మౌత్ టాక్ కనక పాజిటివ్ గా ఉంటే ఆడియన్స్ పెరిగే అవకాశాలున్నాయి. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సందు ప్రీమియర్ షో చూసి సినిమా గొప్పగా ఉందని, క్లైమాక్స్ షాక్ ఇస్తుందని ఏదేదో అంటున్నాడు కానీ అతన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. సో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో విక్రాంత్ రోనా పాసా ఫెయిలా తేలిపోతుంది .
This post was last modified on July 27, 2022 9:45 am
ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం…
బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న బలం.. దక్షిణాదికి వచ్చే సరికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజయ్, కిషన్‌రెడ్డి, పురందేశ్వరి వంటివారు…
తెలుగులో ఫ్రాంఛైజీ చిత్రాలకు ఊపు తెచ్చిన చిత్రం.. హిట్. నాని నిర్మాణంలో శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్: ది ఫస్ట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఎదురైన అనుభవం చాలా పెద్దదే. అయితే.. ఆయన దాని నుంచి ఎంత…
కొన్ని పాటలు కొన్ని సందర్భాలకే సూట్ అవుతాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత మర్చిపోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ…
సినిమాల వరకు స్టార్ డంని నిర్ణయించేది మాస్ ప్రేక్షకులే. అందులో సందేహం లేదు. దివంగత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి మహేష్…