Movie News

మగధీర,ఆర్ఆర్ఆర్ స్టయిల్ లో లాఠీ ఫైట్

విశాల్ కొత్త సినిమా లాఠీ వాస్తవానికి వచ్చే నెల 12న విడుదల కావలసింది. అయితే సాంకేతిక కారణాలతో పాటు షూటింగ్ పెండింగ్ ఉండటంతో సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. నిన్న టీజర్ ని వదిలారు. ఖాకీ దుస్తుల్లో విశాల్ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సెల్యూట్ లో ఇలాంటి పాత్ర చేశాడు కానీ ఇందులో సెటప్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది. విశాల్ కు చక్ర, సామాన్యుడు రెండూ వరుస షాకులు ఇచ్చాయి. అభిమన్యుడు ఇచ్చిన కంబ్యాక్ ని నిలబెట్టుకోవడంలో విశాల్ తడబడుతున్నట్టు ఫలితాలే చెబుతున్నాయి.

సరే ఇక లాఠీ విషయానికి వస్తే మగధీరకు దీనికి కనెక్షన్ ఏంటనుకునున్నారా. మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. టీజర్ లో ఓ ఫైట్ చూపించారు. ఓ పెద్ద పాడు బడిన భవంతి. అక్కడికి నగరంలో పేరుమోసిన రౌడీల దగ్గర్నుంచి చిన్న చితక గూండాల దాకా అందరూ వస్తారు. వాళ్ళ టార్గెట్ హీరో ఒక్కడే. వీళ్ళేమో వందల్లో ఉంటారు. మనోడు ఒక్కడు. అయినా భయపడకుండా రండ్రా కాసుకుందాం ఒక్కణ్ణీ వదిలిపెట్టనని సవాల్ విసిరి లాఠీ పట్టుకుని వాళ్ళ మీదకు దూకుతాడు. అన్నట్టే ఎవరినీ వదలకుండా బాది పారేస్తాడు.

ఇది రాజమౌళి వాడిన ఫార్ములాని వేరే చెప్పాలా. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లోనూ రామ్ చరణ్ వేసిన రామరాజు పాత్ర వేల మందిని కొట్టుకుంటూ ఆఫీసర్ చెప్పిన వాడిని పట్టుకోవడం చూశాం. వీటినే మిక్స్ చేస్తూ దర్శకుడు వినోద్ కుమార్ ఇలా లాఠీ కోసం వాడేసుకున్నాడు. మాస్ కి కనెక్ట్ అయ్యేలా బాగానే కట్ చేశారు కానీ ఈ లాఠీ అయినా విశాల్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి. అన్నట్టు ఈ టైటిల్ మహేష్ బాబు ఒక్కడు దర్శకుడు గుణశేఖర్ డెబ్యూ మూవీకి పెట్టింది. అప్పట్లో అది పెద్దగా ఆడలేదు.

This post was last modified on July 25, 2022 5:29 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago