ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న వి.వి.వినాయక్.. గత దశాబ్ద కాలంలో స్థాయికి తగ్గ సినిమాలు తీయక బాగా వెనుకబడిపోయాడు. ఈ మధ్య ఆయన అసలు లైమ్ లైట్లో లేడు. హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తున్నప్పటికీ దాని గురించి ఇక్కడ సౌండేమీ లేదు. కాగా వినాయక్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సినిమాలతో పాటు రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు.
వినాయక్‌ది పొలిటికల్ ఫ్యామిలీనే కావడంతో ఆంధ్రా ప్రాంత రాజకీయ నాయకులు చాలామందితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి తెలుగుదేశం నేత, ప్రస్తుత వైకాపా నాయకుడు అయిన కొడాలి నాని గురించి వినాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీడీపీలో నానికి టికెట్ తెప్పించడంలో తన పాత్ర కూడా ఉందని వినాయక్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను, జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి చంద్రబాబుతో నాని టికెట్ గురించి మాట్లాడినట్లు అతను తెలిపాడు.
ఐతే ఎందుకో తెలియదు కానీ.. నానికి చంద్రబాబు అంటే ముందు నుంచి అసలు పడదని వినాయక్ వెల్లడించాడు. ఎన్టీ రామారావు అంటే కొడాలి నానికి అమితమైన ప్రేమ అని.. ఆయన కోసం గొంతు కోసేసుకుంటాడని.. ఆయన విషయంలో చంద్రబాబు చేసింది నచ్చక కోపం పెంచుకుని ఉండొచ్చనే ఉద్దేశంలో వినాయక్ మాట్లాడాడు. చంద్రబాబుకు, నానికి మధ్య ఏం ఉందో, ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ నాని మాత్రం తమ ఆంతరంగిక సంభాషణలప్పుడు కూడా చంద్రబాబును దారుణంగా తిడుతుంటారని.. ఆ మాటలు భరించలేని విధంగా ఉంటాయని వినాయక్ తెలిపాడు.
ఇక గత కొన్నేళ్లుగా చంద్రబాబును నాని విపరీతంగా తిడుతుండటం గురించి స్పందిస్తూ.. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలతో తాను చాలా హర్ట్ కూడా అయ్యానని.. నానీతో ఈ విషయం చెప్పానని.. ఐతే అతను ‘నీకు తెలియదు వినాయక్’ అంటూ తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేశారని వినాయక్ తెలిపాడు. ఇక టీడీపీ నుంచి వైకాపాలో చేరి చంద్రబాబును తిట్టే మరో నేత వల్లభనేని వంశీ గురించి చెబుతూ.. అతడికి టికెట్ ఇప్పించడంలో తారక్ పాత్రేమీ లేదన్నట్లుగా మాట్లాడాడు వినాయక్.
This post was last modified on July 25, 2022 4:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…