ఫ్యాన్ వార్స్‌కు కాదేదీ అనర్హం అంటూ తాజాగా మహేష్ అభిమానులు, మిగతా హీరోల అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో తమకు సంబంధం లేని సినిమా విషయంలో తెగ కొట్టేసుకుంటున్నారు. ఆ సినిమా.. థాంక్యూ కావడం గమనార్హం. ఇది మహేష్ సినిమా కాదు. అతడికి ఏ రకంగానూ ఈ సినిమాతో సంబంధం లేదు. మహేష్ ఫ్యాన్స్‌తో గొడవ పడుతున్న వేరే హీరోల అభిమానులకు కూడా దీంతో సంబంధం లేదు. అయినా సరే ఇరు వర్గాల మధ్య వార్ ఒక రేంజిలో నడుస్తోంది. ఇందుకు కారణం.. ‘థాంక్యూ’ సినిమాలో మహేష్ బాబు రెఫరెన్సులు ఉండడమే.
ఇందులో నాగచైతన్య మహేష్‌కు వీరాభిమానిగా నటించాడు. థియేటర్లలో మహేష్ సినిమాలు చూస్తూ, బయట కటౌట్లు అవీ పెట్టి సెలబ్రేషన్స్ చేస్తూ హంగామా చేసే అభిమాని అన్నమాట అతను.
‘థాంక్యూ’ షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే చైతూ ఇందులో మహేష్ డైహార్డ్ ఫ్యాన్‌గా నటిస్తున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. మహేష్ కటౌట్ ముందు చైతూ హడావుడి చేస్తున్న ఆన్ లొకేషన్ పిక్స్ కూడా బయటికి వచ్చాయి. దీంతో అప్పట్నుంచి మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. రిలీజ్ ముంగిట సంబంధిత సీన్ల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.
హీరో మహేష్ అభిమానిగా ఉంటే ఆ సినిమా ఏ రేంజికి వెళ్తుందో చూస్తారంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు సవాళ్లు విసిరారు. అవతలి వర్గం అదీ చూద్దాం అంటూ సినిమా విడుదల కోసం ఎదురు చూసింది. సినిమాలో మహేష్ ఫ్యాన్ బాయ్‌గా చైతూ కనిపించే సన్నివేశాలు బాగానే వచ్చినా.. సినిమాకు అవేవీ అంత ప్లస్ కాలేదు. రిలీజ్ తర్వాత మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని ఓన్ చేసుకోవట్లేదు. ‘థాంక్యూ’కు దారుణమైన ఓపెనింగ్స్ వస్తుండడంతో మహేష్ యాంటీ ఫ్యాన్స్ ఆ హీరోను, తన అభిమానులను టార్గెట్ చేశారు. మహేష్ రెఫరెన్సులు గట్టిగా ఉన్న సినిమా సత్తా ఇదంటూ ఎద్దేవా చేస్తున్నారు. మహేష్ అభిమానులేమో అనవసరంగా ఈ సినిమాను మోసి ఇరుక్కుపోయాం అంటూ ఫీలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2022 8:26 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…