ఈ ఏడాది ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డీజే టిల్లుకి ఇటీవలే సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింపుల్ బడ్జెట్ తో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా కేవలం ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని తీసిన ఈ మూవీ ముఖ్యంగా యూత్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో చూశాం. దెబ్బకు హీరో సిద్ధూ జొన్నలగడ్డ గ్రాఫ్ మారిపోయింది. ఏళ్ళ తరబడి ఎదురు చూసిన బ్రేక్ ఒక్క టిల్లుతో వచ్చేసింది. ఈ కారణంగానే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఓ సినిమాను రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చి మరీ వద్దనుకున్నాడనే టాక్ ఉంది.
ఇక మొదటి భాగం సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడీ సెకండ్ పార్ట్ కి కెప్టెన్ గా వ్యవహరించడం లేదని లేటెస్ట్ అప్ డేట్. అతని స్థానంలో మల్లిక్ రామ్ వచ్చాడు. ఆ మధ్య తేజ సజ్జ – శివాని రాజశేఖర్ లతో అద్భుతం తీసింది ఇతనే. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో దాని బాక్సాఫీస్ స్టామినా బయటపడకపోయినా టేకింగ్ పరంగా మంచి పేరే వచ్చింది. అందుకే ఇప్పుడీ టిల్లు 2 బాధ్యతలు మల్లిక్ రామ్ కు ఇచ్చారట. కథ స్క్రీన్ ప్లే మాటలు ముందులాగే సిద్దు జొన్నలగడ్డనే స్వయంగా రాసుకున్నాడు.
విమల్ కృష్ణ తప్పుకోవడానికి కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఏవో అంటారు స్టాండింగ్ ఇష్యూస్ అని ఇన్ సైడ్ టాక్. సిద్దుది నెక్స్ట్ మూవీ ఇదే వస్తుందా లేక దానికన్నా ముందు మరొకటి ఏదైనా ఉంటుందానే క్లారిటీ ఇంకా రాలేదు. సితార బ్యానర్ ఈసారి బడ్జెట్ కూడా పెంచబోతున్నారట. హీరోయిన్ నేహా శెట్టి పాత్రను తగ్గించి మరో కొత్త భామను జోడించబోతున్నారని గతంలో లీకైన వార్త చక్కర్లు కొట్టింది. బాహుబలి, కెజిఎఫ్ తప్ప సీక్వెల్స్ కి పెద్దగా హిట్ రికార్డు లేని సౌత్ లో డీజే టిల్లు దాన్ని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి
This post was last modified on July 24, 2022 12:22 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…