ప్రమోషన్స్ అనేవి రెండు రకాలుగా చేయొచ్చు. ఏది బడితే అది చేసుకుంటూ పోయే ప్రమోషన్ ఒకరకం అయితే సెలెక్టివ్ గా పెర్ఫెక్ట్ పప్లానింగ్ తో చేసుకునే ప్రమోషన్స్ ఇంకో రకం. డిజిటల్ మీడియా వచ్చాక అందరూ డిజిటల్ ఇంటర్వ్యూ , సోషల్ మీడియా ప్రమోషన్స్ గట్టిగా చేసుకుంటున్నారు. హీరో -హీరోయిన్స్ అవసరం ఉన్నా లేకున్నా అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో కనిపిస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా కుర్ర హీరో నిఖిల్ కూడా తన అప్ కమింగ్ సినిమా ప్రమోషన్ కోసం చాలా పాట్లు పడుతున్నాడు.
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఆగస్ట్ 12న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. రకరకాలుగా నిఖిల్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా టివీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జీ తెలుగులో వచ్చే సీరియల్ లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చాడు నిఖిల్. ‘రాధమ్మ కూతురు’ అనే ధారావాహిక లో ఓ సందర్భంలో మహిళను కాపాడి ఆమెను పెళ్లి మండపానికి తీసుకెళ్ళే సీన్ లో కనిపించాడు. అంతే కాదు సీరియల్ ఈ హీరో కోసం యాక్షన్ సీన్ పెట్టారు. దాంతో నిఖిల్ హీరోలా రెచ్చిపోయి ఫైట్ చేశాడు.
నిజానికి సీరియల్స్ చూసే మహిళల సంఖ్యా ఇంకా బాగానే ఉంది. సీరియల్స్ వచ్చే టైంలో చాలా మంది ఆడవాళ్ళు టీవీలకు అతుక్కుపోతున్నారు. అందుకే నిఖిల్ ఇలా టివీ ప్రమోషన్ చేసి ఉండొచ్చు.పైగా సినిమా శాటిలైట్ రైట్స్ కొన్నది ఆ ఛానెల్ కావడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. వాళ్ళు నిఖిల్ ఇలా వాడుకున్నారు అనొచ్చు. ఏదేమైనా తన సినిమా ప్రమోషన్స్ కోసం నిఖిల్ ఏదైనా చేయడానికి రెడీ గా ఉన్నట్టున్నాడు.
This post was last modified on July 22, 2022 7:52 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…