హీరో నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ‘కార్తికేయ 2’ కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజు నితిన్ మాస్ మూవీ ‘మాచర్ల నియోజిక వర్గం’ రిలీజ్ అవ్వనుంది. సమంత యశోద కూడా వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ సోలో రిలీజ్ కోసం చాలా వెయిట్ చేశాడు. ఎట్టకేలకు జులై 22న ఫిక్స్ చేసుకొని ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. కానీ ఉన్నపళంగా ‘థాంక్యూ’ ని జులై 8 నుండి జులై 22 కి తనకి కన్వినెంట్ గా పోస్ట్ పోన్ చేసుకున్నారు దిల్ రాజు.
దీంతో నిఖిల్ పక్కకి తప్పుకోక తప్పలేదు. అలా చైతు కి సైడ్ ఇచ్చిన నిఖిల్ మళ్ళీ ఆగస్ట్ 5న ఒక డేట్ అనుకున్నాడు. కానీ ఆ డేట్ కి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫిక్సయింది. దాంతో ఇంకా ఎనౌన్స్ చేయకుండానే నిఖిల్ తన ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఒకసారి చైతు సినిమా కోసం మరోసారి కళ్యాణ్ రామ్ సినిమా కోసం కార్తికేయ 2 వాయిదా వేసుకున్నాడు నిఖిల్. ఫైనల్ గా ఇప్పుడు నితిన్ సినిమాతో పోటీ పడబోతున్నాడు.
కార్తికేయ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై కొంత బజ్ ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఏ మాత్రం టాక్ బాగున్నా ఈ సీక్వెల్ తో నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం. పైగా అనుపమ క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. చూడాలి మరి నితిన్ తో పోటీ పడి నిఖిల్ హిట్ కొడతాడా లేదా ?
This post was last modified on July 20, 2022 9:53 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…