మెగా స్టార్ చిరు తన కెరీర్ లో ఎక్కువ మల్టీ స్టారర్లు చేయలేదు. దానికి కొన్ని రీజన్ ఉన్నాయి. చిరు చేసిన 150 సినిమాల లిస్టులో చాలా అరుదుగా మల్టీ స్టారర్స్ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు చిరు రూటు మార్చాడని, చేస్తున్న నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకు ఇతర హీరోల సపోర్ట్ తీసుకుంటున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. మెగా స్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ముంబైలో చిరు -సల్మాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఇంకా కొంత షూట్ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ పెట్టబోతున్నారు మేకర్స్. తమన్ ఓ సాంగ్ రెడీ చేసి రికార్డింగ్ కూడా ఫినిష్ చేశాడు.
ఇక బాబీ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ రోల్ లో కనిపించనున్నాడు. గతంలో చిరంజీవి ‘అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా కనిపించిన రవితేజ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా స్టార్ తో కలిసి నటిస్తున్నాడు. ఇటివలే షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా. అయితే రవితేజ ఎంట్రీతో సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్నయ్య టైంలో రవితేజ కి హీరోగా ఇమేజ్ లేదు. కేరెక్టర్స్ చేస్తూ బండి లాగిస్తున్న టైం అది. కానీ ఇప్పుడు లెక్క మారింది. రవితేజ కి ఓ సెపరేట్ ఇమేజ్ తో పాటు మార్కెట్ ఉంది. కోవిడ్ తర్వాత ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో చిరు ప్రాజెక్ట్ కి రవితేజ కచ్చితంగా హెల్ప్ అవుతాడు.
ఇలా చేస్తున్న రెండు సినిమాల్లో ఇద్దరు స్టార్ హీరోలతో చిరు కలిసి పనిచేయడాన్ని యాంటీ ఫ్యాన్స్ సపోర్ట్ గా భావిస్తున్నారు. మెగా ఇమేజ్ తో కలెక్షన్స్ రావడం కష్టమని భావిస్తూ ఇలా ఇతర హీరోల సపోర్ట్ తో చిరు సినిమాలు చేసి మార్కెట్ రీ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి సల్మాన్ , రవితేజ సపోర్ట్ తో చిరు ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటారో ? ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే చిరుకి దక్కే క్రెడిట్ ఎంత అనేది వేచి చూడాలి.
This post was last modified on July 19, 2022 11:41 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…