పాపం హరీష్ శంకర్..! చాలా కాన్ఫిడెంట్‌గా, ఎనర్జిటిగ్గా కనిపించే హరీష్ శంకర్.. తనను చూసి ఎవరైనా జాలిపడే అవకాశం ఇవ్వడు మామూలుగా అయితే. కానీ ఇప్పుడు అతణ్ని చూసి చాలా మంది అయ్యో అనుకుంటున్నారు. ఎందుకంటే.. ‘గద్దలకొండ గణేష్’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసి కూడా అతను మూడేళ్లుగా మరో సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. పోనీ కొత్త సినిమాకు సంబంధించి రీసెర్చ్, స్క్రిప్ట్ వర్క్‌లో మునిగిపోయి ఉన్నాడా అంటే అదీ లేదు.
స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయింది. కేవలం హీరో ఎప్పుడు ‘రెడీ’ అంటాడా అనే ఎదురు చూస్తున్నాడతను. కానీ ఆ హీరో మాత్రం ఇదిగో అదిగో అంటూనే నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నాడు. ఆ హీరో పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కలయికలో ఇంతకుముందు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రాబోతోందని రెండేళ్ల కిందట అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు.
కానీ ఓవైపు రాజకీయ వ్యవహారాలు, మరోవైపు ఆల్రెడీ ఒప్పుకున్న సినిమా కమిట్మెంట్ల కారణంగా హరీష్‌తో సినిమాను ఎంతకీ మొదలుపెట్టలేకపోతున్నాడు పవన్. కొన్ని నెలల ముందు అయితే.. జూన్-జులై మధ్య ‘భవదీయుడు భగత్ సింగ్’ పక్కాగా మొదలైపోతుందని వార్తలొచ్చాయి. ‘అంటే సుందరానికీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ సైతం ఈ దిశగా సంకేతాలు ఇచ్చాడు. కానీ తాజా సమాచారం ప్రకారం అందుకు అవకాశమే లేదట. మధ్యలో ఉన్న ‘హరి హర వీరమల్లు’ను పవన్ పూర్తి చేయడమే కష్టంగా ఉంది. దీనికి తోడు ‘వినోదియ సిత్తం’ రీమేక్‌కు రంగం సిద్ధమైంది. పవన్ మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు.
జనసేనకు ఈ మధ్య మంచి ఊపు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను పవన్ గుర్తెరిగి మరింతగా రాజకీయాల్లో నిమగ్నం అవ్వాలని చూస్తున్నాడు. ఎన్నికలు వచ్చేలోపు మహా అయితే సినిమాల కోసం ఒక మూడు నెలలు మాత్రమే కేటాయించగలడు పవన్. అది కూడా వచ్చే ఆరు నెలల్లోపే. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉంటుంది.
ఈ టైంలో కొత్తగా ‘భవదీయుడు భగత్ సింగ్’ను మొదలుపెట్టి పూర్తి చేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అందుకే హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు కూడా పరిస్థితి అర్థం చేసుకుని ప్రస్తుతానికి ఈ సినిమాను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు పూర్తయి పవన్ అందుబాటులోకి వస్తే అప్పుడు చూద్దామని వాళ్లు వేరే ప్రాజెక్టుల మీద దృష్టిపెడుతున్నట్లు సమాచారం.
This post was last modified on July 18, 2022 8:36 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…