సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఠక్కున రెండు పేర్లు చెప్పమంటే అభిమానులకు గుర్తొచ్చేవి ముందు పోకిరి ఆ తర్వాత ఒక్కడు. ఇప్పుడంటే మహీని కొంచెం సాఫ్ట్ టచ్ తో చూస్తున్నాం కానీ ఒకప్పుడు మాస్ కి వెర్రెక్కేలా గూస్ బంప్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఇవి. యుట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. టీవీ ఛానల్స్ లో క్రమం తప్పకుండా వస్తుంటాయి. కానీ వీటిని థియేటర్ లో మిస్ అయిన ఇప్పటి జెనరేషన్ ఫ్యాన్స్ ఆ టైంలో వీటి యుఫొరియాని మిస్ అయ్యామని ఫీలవుతూనే ఉంటారు.
అలాంటివాళ్ల కోరిక తీర్చేందుకు పోకిరిని 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్లు వేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
ఈ మేరకు వీటి తాలూకు పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి.ఈ మధ్య వేరే సినిమాలకు ఇలాంటి షోలు వేశారు కానీ అవి కేవలం హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. కానీ పోకిరికి మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయబోతున్నారు.
మొత్తానికి ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్తే. ఇంతకు ముందు బిజినెస్ మెన్, శ్రీమంతుడు లాంటివి రీ రిలీజ్ చేస్తేనే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక పోకిరి చేయబోయే రచ్చ గురించి వేరే చెప్పాలా.
టికెట్ రేట్లు కేవలం ముప్పై నలభై రూపాయలు ఉన్న టైంలో ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ మాస్ క్లాసిక్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా పండుగాడి డైలాగులు, విజిల్స్ వేయించే పాటలు, మణిశర్మ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయికదా. సిద్ధమవ్వండి మరి
This post was last modified on July 18, 2022 8:56 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…