ఈ రోజుల్లో ఏ సినిమా ఆడుతుందో.. ఏ సినిమా పోతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు చాలా సెలక్టివ్‌గా థియేటర్లకు వస్తున్నారు. ఈ క్రమంలో టాక్ బాగున్న సినిమాలు కూడా కొన్ని థియేటర్లలో నిలబడలేకపోతున్నాయి. ఏ కారణంతో ఆ సినిమాలు ఆడలేదో చెప్పలేని పరిస్థితి తలెత్తుతోంది. కొన్నిసార్లు నిడివి కూడా సమస్యగా మారుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే రిలీజైన నేచురల్ స్టార్ నాని సినిమా అంటే సుందరానికీ పరిస్థితి ఇలాగే తయారైంది. అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ బాగానే కసరత్తు చేసి కొంచెం భిన్నంగానే సినిమా తీశాడు. నాని నజ్రియా కూడా చాలా బాగా నటించారు. సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్స్ ఉన్నాయి. అయినా అది ఆడలేదు. ఈ చిత్రానికి ప్రధానంగా ఎక్కువ నిడివి, స్లో నరేషన్ సమస్యగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే అగ్ర నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్లో రాబోతున్న థ్యాంక్ యు సినిమా విషయంలో భయపడినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ముందు ఈ సినిమా రన్ టైం 2 గంటల 50 నిమిషాలని వార్తలొచ్చాయి. తీరా చూస్తే ఇప్పుడు లెంగ్త్ 2 గంటల 9 నిమిషాలకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర రచయిత బీవీఎస్ రవి స్వయంగా ధ్రువీకరించాడు. కానీ థ్యాంక్ యు లాంటి ఫీల్ గుడ్ మూవీకి రన్ టైం మరీ అంత తక్కువ ఉండడం కూడా కరెక్ట్ కాదేమో అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఇలాంటి చిత్రాలు నెమ్మదిగానే సాగుతాయి. జీవితంలోని వివిధ దశలను చూపించేటపుడు నరేషన్ స్లోగానే ఉంటుంది. అప్పుడే ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే లెంగ్త్ అనేది సమస్య కాదు. నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు ఆడట్లేదని కోతలు మరీ ఎక్కువగా వేస్తే.. సినిమాలో ఫీల్ దెబ్బ తినొచ్చు. సినిమా వెయ్యాల్సినంత ఇంపాక్ట్ వేయకపోవచ్చు. మరి విక్రమ్ కుమార్, దిల్ రాజు కలిసి సరైన ఔట్‌పుట్‌తోనే సినిమాను రిలీజ్ చేశారో లేదో చూడాలి.
This post was last modified on July 18, 2022 10:46 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…