Movie News

థాంక్ యులో మహేష్ 3 సినిమాలు

ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న నాగ చైతన్య థాంక్ యు బజ్ కోసం బాగా కష్టపడుతోంది. చైతుకున్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఓపెనింగ్ గురించిన టెన్షన్ లేదు కానీ వసూళ్లు కొంచెం గట్టిగా రావాలంటే మాత్రం మొదటి మూడు రోజుల పెర్ఫార్మన్స్ చాలా కీలకం. యూనిట్ ప్రమోషన్ పరంగా చేయాల్సిందంతా చేస్తోంది కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ముఖ్యంగా ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్, మజిలీ సినిమాల తాలూకు షేడ్స్ కనిపించడం సాధారణ ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ని తగ్గిస్తోంది.

అందుకే హైప్ కోసం ఏ అవకాశాన్ని టీమ్ వదిలిపెట్టడం లేదు. ఇందులో చైతు మహేష్ బాబు వీరాభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాలేజీ బ్యాక్ డ్రాప్ మొదలయ్యాక ఈ సన్నివేశాలు వస్తాయి. రచయిత బివిఎస్ రవి దీన్ని నొక్కి చెబుతూ ఒక్కడు, పోకిరి, దూకుడు ఈ మూడు సినిమాల రెఫరెన్సులు థాంక్ యులో ఉంటాయని ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ప్రిన్స్ ఫ్యాన్స్ కి గేలం వేయడానికేనని అర్థమవుతోంది. నిజంగా వాళ్ళు మద్దతు ఇచ్చే పనైతే ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల మీద పాజిటివ్ గా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.

కానీ ఈ ఒక్క పాయింట్ తోనే అంచనాలు పెంచలేం కానీ ఏదో రకంగా సోషల్ మీడియాలో టాపిక్ గా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన థాంక్ యులో రాశిఖన్నా మెయిన్ హీరోయిన్. అంచనాల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద సోలో రిలీజ్ దక్కించుకోవడం చైతుకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. ముందు అనుకున్న కార్తికేయ 2 తప్పుకుంది. పోటీ ఉన్న శంషేరా మీద తెలుగులో ఏమంత హైప్ లేదు. సో ఈ అవకాశాన్ని సరైన కంటెంట్ తో వాడుకుంటే హిట్టు కొట్టినట్టే.

This post was last modified on July 17, 2022 9:20 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

5 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

7 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

7 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

7 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

11 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

11 hours ago