ఆగస్ట్ 5 విడుదలకు నువ్వా నేనాని పోటీకి సిద్ధపడిన బింబిసార, కార్తికేయ 2లలో ఒకరు వెనక్కు తగ్గాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండూ ఫాంటసీ జోనర్లు కావడంతో ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని పంపిణిదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీస్ కావడంతో ఏ చిన్న రిస్క్ తీసుకున్నా నిర్మాతలు ఇబ్బందుల్లో పడతారు. అందుకే మధ్యేమార్గం పరిష్కారానికి అగ్ర నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ ఒకరు రంగంలో దిగి చర్చిస్తున్నట్టు టాక్.
అయితే అంత ఈజీగా వెనక్కు తగ్గేందుకు ఇద్దరూ రెడీగా లేరట. కారణం లేకపోలేదు. ఒకవేళ ముందు వద్దామనుకుంటే జూలై 29న రామారావు ఆన్ డ్యూటీ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని కూర్చుంది. దానికన్నా కేవలం వారం ముందే థాంక్ యు వచ్చి ఉంటుంది కాబట్టి థియేటర్లలో అంత సులభంగా తీసేసే పరిస్థితి ఉండదు. పైగా చాలా చోట్ల రెండు నుంచి మూడు వారాల కనీస అగ్రిమెంట్ చేస్తున్నారని తెలిసి వచ్చింది. అలాంటప్పుడు రామారావు మీదకు వెళ్తే స్క్రీన్లు తగ్గడంతో పాటు కలెక్షన్లను పంచుకునే ప్రమాదం పొంచి ఉంది.
అలా అని ఇంకో వారం వాయిదా వేద్దామంటే 11, 12 తేదీల్లో వరసగా లాల్ సింగ్ చడ్డా, కోబ్రా, మాచర్ల నియోజకవర్గంలు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్నాయి. వీటి మధ్య దూరితే అదింకో తలనెప్పి. నిజానికి కార్తికేయ 2 ముందు అనుకున్న తేదీ జూలై 22. దానికే కట్టుబడి ఉంటే ఇప్పుడీ ఇబ్బంది వచ్చేది కాదు. అయిదో డేట్ కి ఈ రెండే సమస్య అనుకుంటే దుల్కర్ సల్మాన్ సీతా రామమ్ కూడా తగ్గను అంటోంది. మరి కళ్యాణ్ రామ్ నిఖిల్ లలో ఎవరు డ్రాప్ అవుతారో లేదా సై అంటూ క్లాష్ కి తెగబడతారో చూడాలి.
This post was last modified on July 17, 2022 7:19 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…