పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు రామారావు ఆన్ డ్యూటీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఇవాళ గ్రాండ్ ఈవెంట్లో థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ లో దివ్యంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ లో అడుగు పెట్టిన సామ్ సీఎస్ సంగీతం సమకూర్చారు. ఫస్ట్ లుక్ నుంచి టీజర్ దాకా ఇది పక్కా మాస్ బొమ్మ అనే అభిప్రాయం కలిగించారు కాబట్టి ట్రైలర్ కూడా దానికి తగ్గట్టే పూర్తి కమర్షియల్ గా కనిపిస్తోంది. .
రామారావు ఒక రెవిన్యూ ఆఫీసర్. అతను కొత్తగా డ్యూటీకి వెళ్లిన ఊళ్ళో కొందరు మాయమై ఉంటారు. రికార్డుల్లో పేర్లు లేకపోవడంతో పాటు మనుషుల జాడ తెలియనంతగా ఆచూకీ దొరక్కుండా పోతారు. ఇదెందుకో కనుక్కుందామని హీరో రంగంలోకి దిగుతాడు. ప్రభుత్వం కోసం కాకుండా ధర్మం కోసం వృత్తి నిర్వహించాలని అర్థమవుతుంది. దీంతో పోలీస్ లాగా లాఠీ పట్టుకుంటాడు, ఆఫీసర్ లాగా సంతకాలు చేస్తాడు. ప్రమాదకరమైన వలయాన్ని ఛేదించే బాధ్యతను తీసుకుంటాడు. చివరికి విజయం సాధించాడా లేదా అనేదే స్టోరీ
మొత్తానికి రవితేజ సినిమా నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తారో అవన్నీ ఉన్నట్టే అనిపిస్తున్నాయి కానీ ఇది కూడా రొటీన్ ట్రాక్ పట్టదుగా అని అనుమానం కలిగించే అంశాలు లేకపోలేదు. సామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ గా అనిపిస్తే క్యాస్టింగ్ మాత్రం భారీగా సెట్ చేసుకున్నారు. అసలే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద రెగ్యులర్ ఫార్ములాలు వర్కౌట్ అవ్వడం లేదు. మరి క్రాక్ తాలూకు కిక్ ని ఖిలాడీ పోగొట్టాక ఇప్పుడీ రామారావు దాన్నెలా కంబ్యాక్ చేస్తాడో చూడాలి. ఒకరోజు ముందొచ్చే విక్రమ్ రోనాతో రామారావు ఢీ కొట్టనున్నాడు
This post was last modified on July 16, 2022 9:40 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…