అక్కినేని వారసుడు అఖిల్ అరంగేట్రానికి ముందు నెలకొన్న హంగామా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అరంగేట్రం కంటే కూడా అకిల్ డెబ్యూకి ఎక్కువ హడావుడి కనిపించిందంటే అతిశయోక్తి కాదు. పసి పిల్లాడిగా ఉన్నపుడే ‘సిసింద్రీ’ సినిమాతో పాపులారిటీ సంపాదించిన అఖిల్.. పూర్తి స్థాయి హీరో అవడానికి ముందే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’కు మామూలు హైప్ రాలేదు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల సంగతి తెలిసిందే. దీంతో అఖిల్ కెరీర్ తిరోగమనంలో పయనించింది. అంతకుముందు రికార్డుల గురించి మాట్లాడిన వాళ్లు.. అఖిల్‌కు ఒక సక్సెస్ వస్తే చాలనుకున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అతి కష్టం మీద ఆ సక్సెస్ అందుకోగలిగాడు అఖిల్.
ఇప్పుడా ఆత్మవిశ్వాసంతో ‘ఏజెంట్’ లాంటి భారీ చిత్రం చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్, అనిల్ సుంకర లాంటి పెద్ద నిర్మాత కలిసి ఈ సినిమా చేస్తుండడం విశేషం. అఖిల్ ట్రాక్ రికార్డు గురించి పట్టించుకోకుండా భారీ బడ్జెట్ పెట్టేశారు ఈ సినిమా మీద. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశారు. నిన్ననే ‘ఏజెంట్’ టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ సినిమా విషయంలో అఖిల్ ‘ఆలౌట్’ రూట్లో వెళ్లినట్లే కనిపిస్తోంది. మామూలుగా చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా కనిపించే అఖిల్.. ‘ఏజెంట్’ కోసం ఒక రేంజిలో బాడీ పెంచడమే కాదు, యాక్షన్ సన్నివేశాల కోసం ప్రాణం పెట్టి కష్టపడ్డాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
సురేందర్ రెడ్డి కూడా అఖిల్‌ను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయడానికి చాలానే కష్టపడినట్లు కనిపిస్తోంది. కాకపోతే టీజర్లో సన్నివేశాలు, విజువల్స్ క్రేజీగా అనిపిస్తూనే.. కొంచెం అతిగా కూడా అనిపించాయి. టీజర్ చూశాక కొంతమంది బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అంటే.. కొందరేమో డిజాస్టర్ కళ కనిపించిందన్నారు. ఇలా యాక్షన్, మాస్ అంశాల విషయంలో ‘అతి’గా అనిపించే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాయి. లేదంటే చతికిలపడతాయి. మధ్యస్థంగా మాత్రం ఉండవు. మరి ‘ఏజెంట్’ ఈ రెండు కేటగిరీల్లో దేని కిందికి చేరుతుందో చూడాలి.
This post was last modified on July 16, 2022 2:10 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…