భారీ అంచనాలతో రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ది వారియర్ టాక్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడం అభిమానులను బాధిస్తోంది. మొదటి రోజు ఏడు కోట్ల దాకా వసూళ్లు వచ్చినట్టు చెబుతున్నారు కానీ ఈ వీకెండ్ అయ్యాక పరిస్థితి ఏమవుతుందో అంతు చిక్కడం లేదు. అసలు ఫామ్ లో లేని లింగుస్వామిని రామ్ అంత గుడ్డిగా ఎలా నమ్మాడనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన కథల్లో అంత దమ్మే ఉంటే కోలీవుడ్ స్టార్ హీరోలు ఎందుకు వదిలిపెడతారనే మాటలో చాలా లాజిక్ ఉంది. కానీ రామ్ ఎలా మిస్ అయ్యాడో.
ఇది కాసేపు పక్కనపెడితే తమిళంలో ఆఫర్లు తగ్గిన దర్శకులతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలనే సందేశం ఈ ఫలితాల్లో కనిపిస్తోంది. ఆ మధ్య బాలకృష్ణ ఇదే తరహాలో ఫేడ్ అవుట్ అయిన కెఎస్ రవికుమార్ తో రూలర్ చేస్తే ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో చూశాం. ఒకప్పుడు నరసింహ లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ తీసిన డైరెక్టరే కావొచ్చు. కానీ నటుడిగా మారి తన మునుపటి గ్రిప్ ని కోల్పోయాక గొప్ప రిజల్ట్స్ ని ఆశించలేం. రాబోయే చిరంజీవి గాడ్ ఫాదర్ ని డీల్ చేస్తున్న మోహన్ రాజా కూడా కోలీవుడ్ బ్యాచే. కాకపోతే మరీ బ్యాడ్ రికార్డు లేదు.
రానా 1945 కోసం సత్యశివకు ఛాన్స్ ఇస్తే దాన్ని ఇష్టమొచ్చినట్టు చుట్టేసి మమ అనిపించాడు. ఇదే హీరో అరణ్యకు ప్రభు సాల్మోన్ ని నమ్మాడు. ఒళ్ళు హూనం చేసుకుంటే దానికొచ్చిన ఫలితం సున్నా. కెవి గుహన్ తీసిన డబ్ల్యు డబ్ల్యూ డబ్ల్యూ ఓటిటికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది కానీ థియేటర్ అయ్యుంటే ఎవరు పట్టించుకుంటారు. అంతెందుకు రామ్ చరణ్ 15 మీద ఎంత హైప్ ఉన్నా శంకర్ దీంతో కంబ్యాక్ అవ్వాలి తప్పించి ఆయనేమీ భీకరమైన ఫామ్ లో లేడు. సో ఇవన్నీ విశ్లేషించి చూస్తే కథ నచ్చడం ఎంత కీలకమో వాళ్ళ గత కొన్నేళ్ల ట్రాక్ రికార్డుని జాగ్రత్తగా చెక్ చేసుకోవడం చాలా అవసరం
This post was last modified on July 15, 2022 7:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…