Movie News

రామ్ సినిమాలో ఈ డైలాగ్ ఎలా?

యువ కథానాయకుడు రామ్ నటించిన ‘ది వారియర్’ సినిమా గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు టాక్ ఆశించిన స్థాయిలో లేదు. లింగుస్వామి ఒకప్పుడు తీసిన సినిమాల స్థాయిలో ఇది లేదని, ఆయన ముద్ర కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ ఎనర్జీని ఆయన వాడుకోలేదనే కామెంట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి మిక్స్‌డ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా అంతిమంగా ఎలాంటి ఫలితాన్నందుకుంటో చూడాలి.

ఆ సంగతి పక్కన పెడితే.. సినిమాలోని ఒక డైలాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో చిన్న చర్చకు కూడా దారి తీసింది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. ‘‘రాజకీయాల్లోకి పోతున్నాం కదా.. వెన్నుపోటు పొడిచేది నేర్చుకుంటున్నా’’. ఇందులో విలన్ పాత్ర చేసిన ఆది పినిశెట్టి చెప్పిన డైలాగ్ అది. అతను ‘ది వారియర్’లో రౌడీ పాత్ర చేశాడు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట ఈ డైలాగ్ వస్తుంది.

రాజకీయాల్లో వెన్నుపోట్లు అనేది సర్వ సాధారణమే కావచ్చు. ప్రతి పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉండొచ్చు. కానీ ఈ పదం బాగా ఫేమస్ అయింది. ఎక్కువ మంది దాన్ని ఎటాచ్ చేసి చూసేది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనే. సీనియర్ ఎన్టీఆర్‌కు ఆయన వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారనే అపప్రదను ఆయన దశాబ్దాల నుంచి మోస్తున్నారు. అప్పుడు ఆయన ఎందుకు అలా చేశారు.. దాని మీద జనాల అభిప్రాయం ఏంటి అన్నది పక్కన పెడితే.. ప్రత్యర్థులు మాత్రం తరచుగా ఈ విషయాన్ని తెరపైకి తెస్తుంటారు.

ఐతే ఈ వెన్నుపోటు డైలాగ్ ఇప్పుడు రామ్ సినిమాలో రావడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడి మావయ్య అయిన రమేష్ బాబు తెలుగుదేశం మద్దతుదారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఆయన ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుని కొంతమంది చనిపోవడం.. ఆ సమయంలో, తర్వాత జగన్ సర్కారు టార్గెట్ చేయడం గురించీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసేలా రామ్ సినిమాలో డైలాగ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ డైలాగ్ రామ్‌కు తెలిసే సాయిమాధవ్ బుర్రా రాశారా.. రామ్ దాన్ని ఓకే చేశాడా.. లేక తెలియకుండా ఇరికించేశారా అన్నదే డౌట్.

This post was last modified on July 15, 2022 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

3 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

22 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

38 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

55 minutes ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago