పవన్ కళ్యాణ్ సినీ అభిమానుల బాధ మామూలుగా లేదిప్పుడు. తమ హీరో నుంచి వాళ్లు కోరుకునేది ఒకటి ఆయన చేసేది ఇంకోటి. రీఎంట్రీలో స్ట్రెయిట్ సినిమాలతో అలరిస్తాడనుకుంటే.. వరుసగా రెండు రీమేక్‌లు వదిలాడు. పింక్, అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌ల్లో పవన్ నటించడం అభిమానులకు ఎంతమాత్రం ఇష్టం లేదనే చెప్పాలి. అయినా అంగీకరించారు. ఆ చిత్రాలను ఉన్నంతలో బాగానే తీర్చిదిద్దడంతో ఓ మోస్తరుగా ఆదరించారు.
ఆ తర్వాత అయినా పవన్ తాను లైన్లో పెట్టిన ఆసక్తికర స్ట్రెయిట్ చిత్రాలను పూర్తి చేస్తాడేమో అని చూస్తే.. అది జరగట్లేదు. ఈ మధ్య ‘హరి హర వీరమల్లు’ కోసం పవన్ గట్టిగా ప్రిపేరవడం.. ఇక విరామం లేకుండా ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొని దాన్ని పూర్తి చేస్తాడని వార్తలు రావడం అభిమానులను సంతోష పెట్టింది. కానీ కొత్త షెడ్యూల్ కోసం అంతా రెడీ చేసుకున్నాక స్క్రిప్టులో లోపాలని, ఇంకోటని నెగెటివ్ న్యూస్‌లు రావడం మొదలైంది. సినిమా షూటింగ్ సంగతి అయోమయంగా మారింది. అసలీ సినిమా పరిస్థితేంటో తెలియకుండా పోయింది.
మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రీకరణను జూన్ నుంచే మొదలుపెట్టేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ చివరికా వార్త కూడా నిజం కాలేదు. మూడేళ్ల నుంచి మరో సినిమా చేయకుండా ఎదురు చూస్తున్న హరీష్‌కు ఇంకా నిరీక్షణ తప్పట్లేదు. దీంతో అతను ఈ సినిమాను పక్కన పెట్టి రామ్‌తో ఓ సినిమా చేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని ఈ ప్రాజెక్టు అయినా అతను స్వేచ్ఛగా చేసుకునే అవకాశం కనిపించడం లేదు. పవన్ పూర్తిగా ‘నో’ చెప్పినట్లు కూడా కనిపించడం లేదు. అలా అని ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను వెంటనే మొదలుపెట్టి పూర్తి చేసే సూచనలు కూడా కనిపించడం లేదు.
ఇంకోవైపు తమిళ చిత్రం ‘వినోదియ సిత్తం’ రీమేక్‌లో పవన్ నటిస్తాడని అన్నారు. ఆ సినిమా చిత్రీకరణ మొదలవుతున్నట్లు మూణ్నాలుగు నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దాని విషయంలో అభిమానులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఆ చిత్రం మొదలూ కాలేదు. అలాగని ఆ సినిమా ఉండదన్న గ్యారెంటీ కూడా లేదు. ఇంకోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా గురించి అసలు ఊసే లేదు. సుజీత్ దర్శకత్వంలో ‘తెరి’ రీమేక్ అంటూ ఆ మధ్య గట్టి ప్రచారం జరిగింది. ఇప్పుడేమో అది క్యాన్సిల్ అంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో, అసలు పవన్ సినిమాల పరిస్థితేంటో తెలియక అతడి అభిమానులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
This post was last modified on July 14, 2022 9:47 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…