మాములుగా పేరున్న ఆర్టిస్టుల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉంటుంది. ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయిపల్లవి గార్గి, ప్రభుదేవా మై డియర్ భూతం రెండు డబ్బింగ్ వెర్షన్లు శుక్రవారం విడుదలవుతున్నాయి. కానీ అవొస్తున్న దాఖలాలు కానీ, ప్రేక్షకులు ఆసక్తి చూపించే సూచనలు కానీ ఏవీ లేవు. ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్లు గట్రా చేసినా లాభం లేకపోతోంది.
ఇదంతా కాదు కానీ అసలు ది వారియర్ బుకింగ్సే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వీటికి ఆశించడం అత్యాశే అవుతుంది. గురువారం రిలీజ్ ఉంటే బుధవారం రాత్రికి హైదరాబాద్ మొత్తానికి కేవలం ఇరవై శాతం లోపే టికెట్లు తెగాయంటేనే జనాల అనాసక్తి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ముందు వర్షమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరుణ దేవుడి విశ్వరూపమే కనిపిస్తోంది. జనాలు గల్లంతవుతున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు.
ఇలాంటి సిచువేషన్ లో జనం థియేటర్లకు రావాలనుకోవడం సబబు కాదు కానీ అలా అని అన్నీ వాయిదా వేసే పరిస్థితి లేదు. గార్గి కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే సీరియస్ మూవీ కాగా మై డియర్ భూతం చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం. ఫిదా టైంలో సాయిపల్లవి, ప్రేమికుడు ట్రెండ్ లో ప్రభుదేవా ఒకప్పుడు వీళ్ళ ఇమేజే పబ్లిక్ ని హాలు దాకా లాకొచ్చింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయ్యింది. అయినా ఇకపై మన సినిమా ఓటిటికి పనికొస్తుందా లేక థియేటర్ బొమ్మనా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం అవసరం.
This post was last modified on July 14, 2022 9:19 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…