ఇంకో రెండే వారాల్లో మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ విడుదల కానుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. దర్శకుడు శరత్ మండవ ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు కానీ హీరో ఇంకా రంగంలోకి దిగలేదు. ఖిలాడీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి రవితేజ ఫ్యాన్స్ కు దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. టీజర్ ఓ మోస్తరుగా పర్లేదనిపించినప్పటికీ ఓవరాల్ గా సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడంలో తడబడింది. ఈ కారణంగానే బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.
ఇదంతా మారాలంటే రామారావు అదే రవితేజ డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మొదలుపెడితే ఓపెనింగ్స్ టైంకంతా హైప్ ని పెంచొచ్చు. సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, స్టార్ యాంకర్స్ తో ఇంటర్వ్యూలు, రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అప్డేట్లు, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చెప్పుకుంటూ లిస్టు చాంతాడంతా ఉంది. ఇది అందరూ చేస్తున్నదే. ఆర్ఆర్ఆర్ అంతటి గ్రాండియర్ కే రాజమౌళి ఇద్దరు హీరోలను వెంటబెట్టుకుని ఆఖరికి తమిళనాడు కేరళలో చిన్నా చితకా హోస్ట్ లతో కూడా ప్రోగ్రాంస్ చేయించాడు.
అలాంటిది రామారావు ఇంత సైలెంట్ గా ఉంటే లాభం లేదు. అసలే వర్షాలతో జన జీవనం బాగా ప్రభావితం చెందింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ది వారియర్ సైతం ఈ కారణంగానే బుకింగ్స్ లో దూకుడు చూపించలేకపోతోంది. అలాంటిది ఈ నెల 29న వచ్చే మాస్ బొమ్మకు హంగామా ఓ రేంజ్ లో ఉండాలి. దివ్యంశ కౌశిక్, రజిషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెవిన్యూ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ధమాకా, రావణాసురల థియేట్రికల్ బిజినెస్ కు రామారావు ఫలితం కీలకంగా మారనుంది.
This post was last modified on July 13, 2022 3:01 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…