భవదీయుడు భగత్ సింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ నిరీక్షణ ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. హరిహరవీరమల్లుని పూర్తి చేయాల్సిన బాధ్యతతో పాటు వినోదయ సితం రీమేక్ ని వేగంగా ఫినిష్ చేసే టాస్క్ ని ఒప్పుకున్న పవర్ స్టార్ ఇవి రెండూ కాగానే జనసేన కార్యకలాపాల్లో బిజీ కాబోతున్నాడు. అక్టోబర్ నుంచి యాత్ర మొదలుపెట్టబోతున్నట్టు ఆల్రెడీ చెప్పేశారు. సో ఇప్పట్లో భగత్ సింగ్ కు మోక్షం దక్కే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఎప్పుడో కూడా చెప్పలేని స్థితి.
ఈ కారణంగానే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసేందుకు ప్రొసీడ్ అవ్వమని పవనే హరీష్ కు సూచించినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇంకా వెయిట్ చేసే కొద్దీ టైం వేస్ట్ అవుతోంది కాబట్టి మళ్ళీ ఓ ఏడాది తర్వాత దీని గురించి ఆలోచిద్దామని చెప్పినట్టు వినికిడి. ఇదంతా క్లారిటీ తీసుకున్నాకే మొన్న వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ రామ్ తో చేయబోయే మూవీ గురించి హింట్ ఇచ్చి ఆ రకంగా పొగిడాడని అంటున్నారు. ఈ గ్యాప్ లో హరీష్ ఏటిఎం అనే వెబ్ సిరీస్ తో పాటు మరో రెండు బడ్జెట్ సినిమాలకు కథలిచ్చాడు.
నిజానికి పవన్ అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంది భవదీయుడు భగత్ సింగ్ మీదే. స్ట్రెయిట్ సబ్జెక్టుతో పాటు గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి మరోసారి బాక్సాఫీస్ జాతర చూడొచ్చని ఆశపడ్డారు. దీని కోసమే ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్న మైత్రి నిర్మాతలు ఇప్పుడేం చేస్తారో కాలమే సమాధానం చెప్పాలి. పవన్ టీమ్ నుంచి మాత్రం పొలిటికల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ఏడాదికి భీమ్లా నాయక్ ఒకదానితోనే సర్దుకోక తప్పేలా లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వెండితెర దర్శనం 2023లోనే ఉంటుంది
This post was last modified on July 13, 2022 2:57 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…