ఈ మధ్య రిలీజైన ‘విక్రమ్’ మినహా ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మేజిక్ నంబర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. నిజానికి కోలీవుడ్ లోనే కాదు కమల్ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాదాపు ఆరు కోట్లకు కొన్న ‘విక్రమ్’ తెలుగు వర్షన్ పదిహేను కోట్లుకు పైగా కొల్లగొట్టింది. దర్శకుడు లోకేష్ కనగారాజ్ చూపించిన మాస్ కంటెంట్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మళ్ళీ మళ్ళీ చూస్తూ భారీ కలెక్షన్స్ అందించారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఏ చిత్రం పెద్దగా ఆడలేదు. అన్నీ రెండు మూడు రోజులకే థియేటర్స్ నుండి సర్దుకున్నాయి.
ఇలాంటి టైంలో ఇప్పుడు కమల్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకునే హీరో ఎవరా ? అనే ఆసక్తి నెలకొంది. ఈ నెలలో మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో రామ్ ‘ది వారియర్’ , నాగ చైతన్య ‘థాంక్యూ’, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఉన్నాయి. ఈ మూడిటిపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. వీటిలో ‘ది వారియర్’ , ‘రామారావు ఆన్ డ్యూటీ’ కమర్షియల్ బిగ్ నంబర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మాస్ కంటెంట్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమాలు కాబట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం. ఇక ‘థాంక్యూ’ ని కూడా తీసి పారేయలేం. సినిమా బాగుంటే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చే చాన్స్ ఉండనే ఉంది.
ఈ మూడిటిలో మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళు దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా ఏంటో ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కమల్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టే సినిమా ఈ మూడిటిలో ఉందో లేదా మరో స్టార్ హీరో సినిమా రావలసిందేనా ? వేచి చూడాలి.
This post was last modified on July 11, 2022 10:25 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…