Movie News

సురేష్ బాబు అంత మాట అనేశాడేంటి?

టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత అనుభవజ్ఞులైన, యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా సురేష్ బాబు పేరు చెప్పేయొచ్చు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన సినిమాల్లోనే ఉన్నారు. తన తండ్రి రామానాయుడి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సిినీ నిర్మాణాన్ని, స్టూడియోను నడిపిస్తున్నారాయన.

ట్రెండ్‌కు తగ్గట్లుగా అప్ డేట్ అవుతూ.. న్యూ వేవ్ సినిమాలూ తీస్తున్నారాయన. తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి విజయాన్నందుకున్న ట్రెండీ మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిందే. గత కొన్నేళ్లుగా ఆచితూచి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తూ చాలా వరకు మంచి ఫలితాలే అందుకున్నారాయన. ఐతే ఇంత విజయవంతంగా కొనసాగుతూ కూడా సినీ నిర్మాణం పట్ల చాలా వైరాగ్యంతోనే ఉన్నారు సురేష్ బాబు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంత అనుభవం ఉన్న మీకు దర్శకత్వం చేపట్టే ఉద్దేశం లేదా అని అడిగితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల నిర్మాణం కొనసాగిస్తానో లేదో తెలియట్లేదు అనేశారు సురేష్ బాబు. ‘‘అసలీ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మళ్లీ సినిమాలు నిర్మిస్తామో లేదో అన్న భయాలు కలుగుతున్నాయి. ఇంకా దర్శకత్వం కూడానా? ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతాం.. అసలిది ఎప్పటికి అదుపులోకి వస్తుంది.. అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కరోనా నుంచి బయటపడే వరకు సినీ పరిశ్రమతో పాటు అన్ని రంగాలకూ ఇబ్బందులు తప్పవు’’ అన్నారు సురేష్ బాబు.

కరోనా వల్ల దారుణంగా దెబ్బ తిన్న ఇండస్ట్రీల్లో సినీ రంగం కూడా ఒకటి. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన సినిమాలు.. షూటింగ్ మధ్యలో ఉన్నవి.. ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్నవి.. అన్నింటి పైనా దీని ప్రభావం పడింది. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతే ఇంత మాట అన్నారంటే.. ఇక మామూలు ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on June 30, 2020 5:41 pm

Share
Show comments
Published by
Satya
Tags: Suresh Babu

Recent Posts

చంద్రబాబు భూమికే ఎసరు పెట్టేశారే!

వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…

1 hour ago

స‌ల‌హాదారులు వ‌చ్చేస్తున్నారు.. బాబు తాంబూలం వారికే.. !

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎం విచ‌క్ష‌ణ…

7 hours ago

విజ‌య వార‌ధి రెడ్డి.. విజ‌య‌మ్మ ఎంట్రీ..?

"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయ‌న మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుప‌డుతున్నా" ఓ 15 ఏళ్ల కింద‌ట క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన రాజ‌కీయం…

9 hours ago

మోదీకి నిర్మలనే ‘ఛాయిస్’ ఎందుకయ్యారంటే..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…

10 hours ago

అర్జున్ రెడ్డికి మొదటి ఛాయస్ సాయిపల్లవి : సందీప్ వంగా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…

11 hours ago

పెద్దిరెడ్ది అయినా!… పిచ్చిరెడ్డి అయినా!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…

11 hours ago