పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో పెద్ద హిట్లుగా నిలిచి, క్లాసిక్ స్టేటస్ అందుకున్న సినిమాల టైటిళ్లను ఇప్పుడు యువ కథానాయకులు ఒక్కొక్కరుగా వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘తొలిప్రేమ’ టైటిల్‌ను మెగా ఫ్యామిలీకే చెందిన వరుణ్ తేజ్ తన సినిమాకు వాడుకున్నాడు. ఆ టైటిల్ విషయంలో ముందు విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. సినిమా అయితే మంచి ఫలితాన్నే అందుకుంది.
ఈ మధ్యే విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో మరింత వ్యతిరేకత కనిపించింది. అందుకు విజయ్ మెగా ఫ్యామిలీకి చెందిన వాడు కాకపోవడం, అలాగే ‘ఖుషి’ టైటిల్‌తో అభిమానులకు ఎమోషనల్ కనెక్షన్ ఉండడం కూడా కారణమే. అయినప్పటికీ విజయ్ అండ్ కో వెనక్కి తగ్గలేదు. ఇప్పుడిక మరో పవన్ టైటిల్‌తో కొత్త సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి పవన్ టైటిల్ వాడబోయేది అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ అక్కినేని అట.
గత ఏడాది ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచిలర్‌తో తొలి విజయాన్నందుకుని.. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే భారీ చిత్రం చేస్తున్నాడు అఖిల్. త్వరలోనే ఈ సినిమా టీజర్ లాంచ్ కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. అఖిల్ తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో అతను నటించబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారట.
ఐతే పవన్ ‘తమ్ముడు’ సినిమాలో మాదిరి అన్నదమ్ముల కథ కాదు ఇది. అక్కా తమ్ముళ్ల బంధం నేపథ్యంలో సెంటిమెంట్, యాక్షన్ టచ్ ఉన్న కథతో వేణు సినిమా చేయబోతున్నాడని.. తమ్ముడిగా అఖిల్ నటించబోతున్నాడని అంటున్నారు. ఈ టైటిల్‌ను ఖాయం చేసినట్లే అని.. సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఈ టైటిల్‌తోనే జరగబోతోందని అంటున్నారు. మరి ఈ టైటిల్ విషయంలో పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 11, 2022 5:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…