ఊహించిన దానికన్నా చాలా పెద్ద విజయం అందుకుని బ్లాక్ బస్టర్ సాధించిన అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ క్రాక్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తో సంక్రాంతి రేస్ ని గెలిచిన దర్శకుడు గోపిచంద్ మలినేని అంటే ఇక చెప్పేదేముంది.
ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇవన్నీ మాస్ మసాలా అనే గ్యారెంటీ ఇవ్వడంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు డిస్ట్రిబ్యూటర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు ట్రేడ్ నుంచి అందిన సమాచారం.
విడుదలకు సంబంధించి డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దాని ప్రకారం అఖండ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ డిసెంబర్ 2 ని థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. అఫీషియల్ గా టైటిల్ తో ప్రకటించాలని డిసైడ్ కావడంతో అప్పటిదాకా అధికారికంగా చెప్పకపోవచ్చు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీకి మరోసారి తమన్ సంగీతం బ్యాక్ బోన్ గా నిలవనుంది. ఇప్పటికైతే ఆ తేదీకి ఎవరూ వస్తామని చెప్పలేదు. బాలయ్య కనక ఫిక్స్ అయితే ఇతర హీరోలు వేరే ఆప్షన్ ఎంచుకుంటారు.
ముందు దసరా సీజన్ ని టార్గెట్ చేసుకున్నప్పటికీ బాలయ్యకు కరోనా వచ్చి కొంత బ్రేక్ పడటం, అమెరికా వీసా పనుల్లో జాప్యం జరగడం లాంటి కారణాల వల్ల ఫ్రెష్ షెడ్యూల్ ని టర్కీకి షిఫ్ట్ చేసుకున్నారు. ఆక్టోబర్ లోపు పూర్తి చేసి ఓ రెండు నెలలు పూర్తిగా ప్రమోషన్ చేస్తారు. మైత్రికి బాలయ్యతో మొదటిసారి కాంబినేషన్ కాబట్టి దానికి తగ్గట్టే బడ్జెట్ విషయంలో రాజీ సూత్రం పాటించడం లేదు. క్రాక్ తర్వాత వచ్చే మూవీ కావడంతో అటు గోపీచంద్ మలినేని కూడా గట్టి హోమ్ వర్కే చేస్తున్నాడు.
This post was last modified on July 11, 2022 12:56 pm
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…