పైరసీని అంతం చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి వివిధ సినీ పరిశ్రమలు. కానీ అది రూపం అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప.. తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఇంతకుముందు పైరసీ ప్రింట్లు అంటే క్లారిటీ లేకుండా, నాసిరకంగా ఉండేవి. కానీ ఇప్పుడు రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్లు బయటికి వస్తున్నాయి. పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. అవి తమ యూజర్లతో కనెక్ట్ అయి ఏదో రకంగా వారికి పైరసీ వెర్షన్లను చేరవేస్తున్నాయి.
వెబ్ సైట్ల ద్వారా నేరుగా కొత్త సినిమాలు చూసేవాళ్లు కొందరైతే.. డౌన్‌లోడ్ చేసుకుని చూసేవాళ్లు ఇంకొందరు. ఇలా ఓ నెటిజన్ తన సినిమా ‘రాకెట్రీ’ని చూసినట్లు నటుడు, దర్శకుడు మాధవన్ కనిపెట్టేయడం ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది. తమ సినిమాలు రిలీజైనపుడు నెటిజన్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌కు సెలబ్రెటీలు స్పందించడం మామూలే.
తనే ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ’కి సంబంధించి పాజిటివ్ ట్వీట్ల మీద కూడా మాధవన్ స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నాడు. రీట్వీట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందన మాధవన్ దృష్టిని ఆకర్షించింది. రాకెట్రీ సినిమా చూశానని.. మాధవన్ నట ప్రతిభ గురించి ఎప్పుడూ సందేహాలు లేవని, కానీ దర్శకుడిగా అరంగేట్రంలోనే అదరగొట్టేశాడని.. పతాక సన్నివేశాన్ని తాను మళ్లీ మళ్లీ చూశానని ఆ నెటిజన్ పేర్కొన్నాడు.
ఐతే మాధవన్ దీనికి స్పందిస్తూ.. “ఆ సన్నివేశాన్ని నువ్వు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగావు” అని ప్రశ్నించాడు. దీన్ని బట్టే ఆ నెటిజన్ చూసింది పైరసీ వెర్షన్ అని అర్థమైపోయింది అందరికీ. థియేటర్లలో అయితే ఒకే రోజు మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడటం సాధ్యం కాదు. ఇంట్లో పైరసీ వెర్షన్ చూస్తున్నాడు కాబట్టే మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడగలిగాడన్నది స్పష్టం. మాధవన్ ఈ విషయాన్ని కనిపెట్టి ట్వీట్ చేయడంతో సదరు నెటిజన్.. ట్వీట్ డెలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇక ‘రాకెట్రీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్‌గా అది అనుకున్నంత విజయం సాధించట్లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్.
This post was last modified on July 10, 2022 3:21 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…