అదేదో సామెత చెప్పినట్టు ఒక రొట్టె కోసం రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో తీర్పు చెప్పడానికి వచ్చిన పెద్ద మనిషి దాన్ని ఎగరేసుకుపోయిందట. అలా ఉంది నాగార్జున ది ఘోస్ట్ వ్యవహారం. ఇవాళ హీరో పాత్రకు సంబంధించిన చిన్న క్యారెక్టర్ ఇంట్రోని విడుదల చేసిన టీమ్ దానికి కూడా చిన్నపాటి ఈవెంట్ టైపు ప్రెస్ మీట్ పెట్టింది. అందులో భాగంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు వీడియో చివర్లో స్పష్టంగా చెప్పేశారు. సో నో డౌట్.
మరి పైన చెప్పిన ఉదాహరణ దేనికనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. దసరాని టార్గెట్ చేసుకుని ఆల్రెడీ చిరంజీవి గాడ్ ఫాదర్ ఇటీవలే హింట్ ఇచ్చింది. కాకపోతే ఏ తేదీ అనేది పేర్కొనలేదు. మరోవైపు అఖిల్ ఏజెంట్ ని కూడా కొంచెం అటు ఇటు ఆ సీజన్ లో వదిలేందుకు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ది ఘోస్ట్ పక్కాగా లాక్ చేసుకోవడం ఆ ఇద్దరికీ ట్విస్ట్ ఇచ్చినట్టే. ఒకవేళ ముందే సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో లేక ఒకవేళ పోటీ వచ్చినా పర్లేదు తమ సినిమాలో అదరగొట్టే కంటెంట్ ఉందని బలంగా నమ్మారో తెలియదు.
దానికి వారం ముందే ప్యాన్ ఇండియా రేంజ్ లో పొన్నియన్ సెల్వన్ 1 వచ్చి ఉంటుంది. సో ఇంకొక్క మూవీకి మాత్రమే రేస్ లో దిగేందుకు అవకాశం ఉంటుంది. సంక్రాంతి లాగా దసరా పండగ ఎక్కువ సినిమాలకు ఆశ్రయం ఇవ్వలేదు. సెలవులు పరిమితంగా ఉంటాయి కాబట్టి వసూళ్లు కూడా అతి భారీగా ఆశించలేం. అలాంటప్పుడు గాడ్ ఫాదర్ వెనక్కు వేళ్తాడో లేక ఏజెంట్ ఇంకో డేట్ చూసుకుంటాడో వేచి చూడాలి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ది ఘోస్ట్ లో నాగార్జున ఏజెంట్ విక్రమ్ గా నటిస్తున్నారు.
This post was last modified on July 10, 2022 9:51 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…