శ్రీవల్లి కహానీ అంతా తూచ్

ఇంకా పుష్ప 2 ది రూల్ షూటింగ్ మొదలుకాలేదు అప్పుడే దాని కథ గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. అందులో ప్రధానమైనది శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ట్విస్టు. రెండో భాగంలో ఆ పాత్రను చంపేస్తారని, దానికి ప్రతీకారంగా ప్రీ క్లైమాక్స్ నుంచి పుష్ప రాజ్ విశ్వరూపం ఉంటుందని ఇలా ఏదేదో స్టోరీ అల్లేశారు. దాన్ని నిజమని నమ్మేసిన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, రకరకాల మీమ్స్ రావడం జరిగిపోయింది. ఫ్రెష్ గా దానికి సంబంధించిన అనఫీషియల్ లీక్ ఒకటి వచ్చేసింది.

దాని ప్రకారం శ్రీవల్లి క్యారెక్టర్ కు ఎలాంటి సాడ్ ఎండింగ్ ఉండదు. చివరి దాకా బ్రతికే ఉంటుందట. ఒకవేళ అలా చేయకపోతే కెజిఎఫ్ 2తో పాటు ఇంకొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకున్నట్టు అనిపించడమే కాక ఇది రొటీన్ గా ఫీలయ్యే ఛాన్స్ ఉండటంతో దర్శకుడు సుకుమార్ అలాంటి మలుపేదీ ప్లాన్ చేయలేదని తెలిసింది. దానికన్నా ఎక్కువగా హీరో విలన్ క్లాష్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఎలా నింపాలనే దాని మీదే తీవ్రమైన డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఫైనల్ కంక్లూజన్ కు వచ్చారో లేదో తెలియదు.

జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ అన్నారు కానీ ఆ సూచనలేమీ కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ కు వెళ్ళిపోయాడు. సుకుమార్ బయట ఈవెంట్లు ఫంక్షన్లలో కనిపిస్తున్నారు కానీ పుష్ప 2 ప్రస్తావన మాత్రం తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారు. చూస్తుంటే ఆగస్ట్ కంటే ముందే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎలా చూసుకున్నా 2023 వేసవి కన్నా ముందు రిలీజయ్యే సూచనలు లేవు. ఒకవేళ ఇంకా ఆలస్యమైన పక్షంలో దసరాకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయట.