తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న హీరోల్లో భాషపై పట్టు, వాచకం, ఉచ్ఛారణ విషయంలో అత్యధిక మార్కులు పడేది జూనియర్ ఎన్టీఆర్‌కే అంటే అతిశయోక్తి కాదు. తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వాచకం, ఉచ్ఛారణ విషయంలో మంచి పట్టుతో సినిమాల్లోకి అడుగుపెట్టాడతను. మొదట్లో అతడి వాయిస్ కొంచెం తేడాగా ఉండేది కానీ.. వయసు పెరిగాక స్పష్టత వచ్చింది. డైలాగ్ డెలివరీలో తనకు తిరుగులేని తారక్ చాటుకున్నాడు. గత దశాబ్ద కాలంలో సినిమా సినిమాకూ తారక్ డైలాగ్ డెలివరీ మెరుగవుతూ వచ్చింది. తెలుగు పదాల్ని పలకడంలో.. పిచ్ పెంచడంలో, తగ్గించడంలో.. సన్నివేశం తాలూకు ఎమోషన్‌ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో తారక్‌కు తారక్‌కు సాటే అని చాలాసార్లు రుజువైంది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన టీజర్లో తారక్ తనదైన వాయిస్ ఓవర్‌తో ఔరా అనిపించాడు. అసలే రోమాలు నిక్కబొడుచుకునే డైలాగ్.. దాన్ని తారక్ ఇంకా ఎలివేట్ చేస్తూ డైలాగ్ చెప్పిన వైనం అమోఘం. అయితే తెలుగు టీజర్లో డైలాగ్ చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ తారక్ ఇదే రేంజిలో డైలాగ్ పేల్చిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హిందీలో తారక్ తన వాయిస్‌లో బేస్‌ను ఇంకా పెంచి.. పదాల్ని స్పష్టంగా పలుకుతూ ఇచ్చిన వాయిస్ ఓవర్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది.
ఉత్తరాది జనాలు తారక్ టాలెంటుకి ఫిదా అయిపోతున్నారు. ఒక్క మలయాళంలో మాత్రమే తారక్ టీజర్‌కు వాయిస్ ఇవ్వలేదు. వాళ్ల యాసను అందుకోవడం చాలా కష్టం. దాని మాడ్యులేషన్లో చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క భాషకు తారక్ దూరంగా ఉన్నాడు. టీజర్లో తారక్ వాయిస్ విన్నాక అతను మిగతా భాషల్లోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…