కీరవాణి కౌంటర్ అంతలోనే మాయం

అసలు ఏ ఉద్దేశంతో రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ గే సినిమా అన్నాడో అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా చెలరేగిన మంటలు ఇప్పుడు అభిమానుల నుంచి సెలబ్రిటీలకు పాకాయి. అంతర్జాతీయ స్థాయిలో ట్రిపులార్ ని ఎక్కడెక్కడి ప్రముఖులో మెచ్చుకుంటూ ట్వీట్లు పెడుతుంటే సౌత్ సినిమా నుంచే అంత గొప్ప స్థాయికి చేరుకున్న రసూల్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్థమవుతున్నాయి. ఒకవేళ ఈయనే ఈ మూవీకి పని చేసి ఉంటే ఇలాంటి అర్థం లేని కామెంట్లు పెట్టేవాడా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇక విషయానికి వస్తే దీనికి ముందుగా బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందించారు. ఆర్ఆర్ఆర్ గే సినిమా కాదని, అసలు ఒకవేళ అదే అనుకున్నా అంత చులకనగా ఎలా మాట్లాడతారని దాన్ని మీరెలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. అంతే కాదు ఎంతో ఖ్యాతి సంపాదించుకున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ఇంతలో కీరవాణి రంగంలోకి దిగి అప్పర్ కేస్ లోయర్ కేస్ అంటూ ఇంగ్లీష్ పదాలను తెలివిగా వాడుతూ రసూల్ మీద చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అందులో కొంత ద్వందార్థం ప్రతిబింబించేలా ఉండటంతో వెంటనే అలెర్ట్ అయిపోయి ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. అయితే క్షణక్షణం అప్రమత్తంగా ఉండే నెటిజెన్లు ఊరికే ఉంటారా. అప్పటికే దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని పెట్టేసుకున్నారు. దీంతో మీమ్స్ మొదలైపోయాయి. కర్ర విరగకుండా పాముని చంపకుండా భలేగా తిప్పి కొట్టారని ఆర్ఆర్ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయన ఏమన్నారనేది ఇక్కడ వివరించడం సభ్యతగా ఉండదు కానీ మొత్తానికి కొత్త వైరల్ టాపిక్ ట్విట్టర్ అంగడికి దొరికేసింది