తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీ స్థాయిలో ప్రయోగాలు చేసి, ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన రాబట్టుకున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. 90వ దశకంలో ఆయన సినిమాలు మామూలు ప్రకంపనలు రేపలేదు. గులాబి, నిన్నే పెళ్ళాడతా, సింధూరం, మురారి, ఖడ్గం సినిమాలు బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా చర్చనీయాంశం అయ్యాయి. అప్పటి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఐతే గత పది పదిహేనేళ్లలో మాత్రం కృష్ణవంశీ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. అయినా కృష్ణవంశీ ఆగిపోలేదు. ఇప్పుడాయన్నుంచి ‘రంగమార్తాండ’ సినిమా రాబోతోంది.
మరాఠీలో విజయవంతమైన ‘నట సామ్రాట్’కు ఇది రీమేక్. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతన్న ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారా అని కృష్ణవంశీని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. ఈ సందర్భంగా ‘హిట్ సినిమా’కు ఆయనిచ్చిన నిర్వచనం ఆసక్తి రేకెత్తించేదే. ఇంతకీ ఆయనేమన్నాడంటే..
‘‘నేను ఇలా చెబితే జనాలకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ.. నేను హిట్ కోసం ఎప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్‌లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ‘రంగమార్తాండ’నే ఎందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి… అంతే’’ అంటూ తన గురువు రామ్ గోపాల్ వర్మ తరహాలో సూత్రీకరించాడు కృష్ణవంశీ. ఆయనిచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో పోస్టులుగా పెట్టి దటీజ్ కృష్ణవంశీ అని కొనియాడుతున్నారు అభిమానులు.
This post was last modified on July 5, 2022 3:12 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…