నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో సినిమాలు చేస్తుంటాడు. సురేందర్ రెడ్డి , అనీల్ రావిపూడి , గుహన్ వంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ దే. ఇప్పుడు తన బేనర్ ద్వారా మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే పీరియాడిక్ ఫాంటసీ సినిమా రాబోతుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో వసిష్ట్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అయితే ఈ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్. ఇటివలే ఎన్టీఆర్ కోసం వసిష్ట్ కళ్యాణ్ రామ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో త్వరలోనే తారక్ తో ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తాజాగా బింబిసార ఈవెంట్ లో స్వయంగా చెప్పుకున్నాడు. ‘బింబిసార’ ని నాలుగు భాగాలుగా తీసి ఓ ఫ్రాంచైజీ లా చేస్తానని కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. వచ్చే ఏడాది రెండో పార్ట్ రిలీజ్ అంటుంది అన్నాడు. దాంతో రెండో భాగంలో ఎన్టీఆర్ ఏమైనా నటించే అవకాశం ఉందా ? అనే ప్రశ్న మీడియా నుండి కళ్యాణ్ రామ్ కి ఎదురైంది.
దానికి బదులు చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు నందమూరి హీరో. నాలుగు రోజుల క్రితమే వసిష్ట్ , నేను తారక్ కోసం ఓ కథ అనుకున్నామని త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వొచ్చని తెలిపాడు. దీంతో కుర్ర డైరెక్టర్ రెండో సినిమాకి ఎన్టీఆర్ ని అప్పజెప్పే ప్లానింగ్ లో కళ్యాణ్ రామ్ ఉన్నట్లు స్పష్టమైంది. ‘బింబిసార’ భారీ హిట్టయితే తారక్ తో వసిష్ట్ సినిమా ఈజీగా పట్టలెక్కేస్తుంది. అన్ని కుదిరితే కొరటాల , ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ ,వసిష్ట్ సినిమా ఉండొచ్చు.
This post was last modified on July 4, 2022 9:08 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…