ప్రస్తుతం సౌత్ ఇండియాలో సాయిపల్లవికి ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ మరే కథానాయికతోనూ మ్యాచ్ చేయలేనిది. ఇక్కడ స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారికి అభిమాన గణం కూడా పెద్దదే. కానీ కేవలం ఒక హీరోయిన్ నటన చూడడానికి థియేటర్లకు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం సాయిపల్లవి విషయంలోనే జరుగుతోంది. అలాంటి గుర్తింపు అందరికీ దక్కదు. నటన పరంగా ఆమె తన అభిమానులను పూర్తిగా సంతృప్తి పరుస్తున్నప్పటికీ.. వరుసబెట్టి ఏడుపుగొట్టు పాత్రలు చేస్తోందనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి.
తెలుగులో ఆమెకు ఎంతో పేరు తెచ్చిన ఫిదా సినిమాలోని భానుమతి పాత్ర చాలా సరదాగా ఉంటుంది. కొంత వరకు ఎమోషన్లు కూడా ఉన్నా.. అందులో ఆ పాత్ర బాగా నచ్చడానికి కారణం ఎంటర్టైన్మెంట్ యాంగిలే. సాయిపల్లవి నుంచి అలాంటి టిపికల్, అగ్రెసివ్ క్యారెక్టర్లే ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇటీవలే విడుదలైన విరాటపర్వంలో వెన్నెల పాత్ర చూసి సాయిపల్లవి అభిమానులకు గుండె పగిలిందనే చెప్పాలి. ఆ పాత్రను అంత శోకంతో చూపించి, విషాదభరితంగా ముగించడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. అసలు ప్రస్తుత ట్రెండులో ఆ టైపు సీరియస్ సినిమాలు, క్యారెక్టర్లు అసలు వర్కవుట్ కావట్లేదు. దీని కంటే ముందు సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీలో సైతం ఆమెది బాధతో నలిగిపోయే, ప్రేక్షకులనూ బాధ పెట్టే పాత్రే. ఈ తరహా ఏడుపుగొట్టు పాత్రలు ఇక వద్దని, జాలీగా ఉండే అల్లరి పాత్రలు చేయాలని సాయిపల్లవికి సోషల్ మీడియా ద్వారా అభిమానులు విజ్ఞప్తులు పెడుతున్నారు.
ఈ నెలలోనే విడుదల కాబోతున్న గార్గి పోస్టర్లు చూసినా.. అది సీరియస్ సినిమాలాగే కనిపిస్తోంది. మళ్లీ ఏదో సమస్యతో ముడిపడ్డ సినిమాలోనే సాయిపల్లవి నటిస్తున్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి పాత్రలు ఇక చాలించి సరదా పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 4, 2022 9:25 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…