పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్వశక్తితో చాలా పెద్ద రేంజికి ఎదిగాడు తమిళ కథానాయకుడు ధనుష్. బేసిగ్గా తమిళ నటుడే కానీ.. ఇప్పుడతను అంతర్జాతీయ స్థాయిలో ఫేమ్ సంపాదించాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో.. రాన్‌జానా, షమితాబ్, ఆత్రంగిరే లాంటి చిత్రాలతో హిందీలో మంచి పేరు తెచ్చుకున్న ధనుష్.. ఇప్పటికే ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫాకిర్ అనే ఇంటర్నేషనల్ మూవీలో నటించాడు.
త్వరలోనే రుసో బ్రదర్స్ రూపొందించిన నెట్ ఫ్లిక్స్ మూవీ ది గ్రే మ్యాన్‌లోనూ మెరవబోతున్నాడు. అతను ప్రస్తుతం తొలిసారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే అవకాశముంది.
దీని తర్వాత ధనుష్ తన తొలి పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమాను శనివారమే ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్ కూడా ఖరారైంది ఈ చిత్రానికి. ధనుష్ ఈసారి ఓ విలక్షణ దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడు. అతడి పేరు.. అరుణ్ మాథేశ్వరన్. అతను రాకీ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సాని కాయిదం తీశాడు. ఈ చిత్రం తెలుగులో చిన్ని పేరుతో అనువాదం అయింది. కీర్తి సురేష్, ధనుష్ అన్న అయిన దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే నేరుగా అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అందులో అడుగడుగునా దర్శకుడి ప్రతిభ ఉట్టి పడింది.
ఇలాంటి దర్శకుడితో ధనుష్ జట్టు కడుతుండటం, అది పాన్ ఇండియా మూవీ కావడం ఆసక్తి రేకెత్తించేదే. రెండు చిత్రాల అనుభవం ఉన్నప్పటికీ ఈ దర్శకుడితో సినిమా చేయడం తన అదృష్టంగా ధనుష్ పేర్కొనడం విశేషం. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే ఇది భారీ చిత్రంలాగే కనిపిస్తోంది.
This post was last modified on July 2, 2022 9:44 pm
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణను…
అదేమీ పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో నటించిన సినిమా కాదు. పోనీ దర్శకుడికి ప్యాన్ ఇండియాలు తీసిన అనుభవం…
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…