కోలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు తీయడంలో హరిది ప్రత్యేకమైన శైలి. చాలా హుందాగా చూపించాల్సిన పోలీస్ పాత్రలను సైతం ఊర మాస్ గా ప్రెజెంట్ చేయడంలో ఈయన స్టయిలే వేరు. సూర్య సింగం దానికి మంచి ఉదాహరణ. విక్రమ్ ను సామీ ద్వారా స్టార్ లీగ్ లోకి తెచ్చింది కూడా హరినే. దీన్నే తెలుగులో బాలకృష్ణతో లక్ష్మినరసింహగా రీమేక్ చేశారు. తాజాగా వచ్చిన అరుణ్ విజయ్ ఏనుగుతో మరోసారి హిట్టు కొట్టాడనే మాట తమిళ మీడియాలో జోరుగానే వినిపిస్తోంది. తెలుగు డబ్బింగ్ మాత్రం అడిగేవారు లేరు.
ఇదిలా ఉండగా హరి టాలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే గోపీచంద్ కి చెప్పిన స్టోరీ ఒకటి ఓకే అయ్యిందట. ఇది గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ కోసం జరిగిన జాప్యం వల్ల తారక్ ప్లాన్స్ మారిపోయాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుని వెయిటింగ్ లో ఉంచి కొరటాల శివది ముందుకు తెచ్చారు. దీంతో హరి ప్రాజెక్ట్ కాస్తా గోపీచంద్ కు చేరిందని కథ నచ్చడంతో అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని లేటెస్ట్ అప్ డేట్. అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించొచ్చు.
మొత్తానికి హరి స్కెచ్చు వర్కౌట్ అవుతున్నట్టే కనిపిస్తోంది. నిజానికి హరి 2010లో సింగం సూపర్ హిట్ అయ్యాక ఆ స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. సింగం 2 పర్లేదనిపిస్తే మూడో భాగం సోసోగానే వెళ్ళింది. ఇక సామీ స్క్వేర్ దారుణంగా బోల్తా కొట్టింది. దాని దెబ్బకే నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఏనుగు చేశారు. సూర్యతో మరో మూవీ అనుకున్నారు కానీ సెట్స్ పైకి వెళ్లేలోపే ఏవో అభిప్రాయభేదాలు వచ్చి దాన్ని ఆపేశారు. అసలే హిట్టు కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు సక్సెస్ ఇస్తే ఇక్కడే మరిన్ని ఆఫర్లు పట్టేయొచ్చు.
This post was last modified on July 2, 2022 5:15 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…