పవిత్ర లోకేష్.. ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. కన్నడలో కథానాయికగా నటించి.. లేటు వయసులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో మంచి పేరు సంపాదించిందామె. హోమ్లీ క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన పవిత్ర.. ‘సమ్మోహనం’ సినిమాలో సీనియర్ నటుడు నరేష్‌కు భార్యగా నటించిన సమయంలో ఆయనతో స్నేహం కుదరడం.. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితంగా మెలగడం తెలిసిందే. బయట కొన్ని వేడుకలకు, కార్యక్రమాలకు జంటగా వెళ్లడంతో నరేష్, పవిత్ర కలిసి జీవిస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
ఇంతలోనే నరేష్ మూడో భార్య మీడియా ముందుకు రావడం.. నరేష్ తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారని.. అలాగే తనను గన్ను పెట్టి బెదిరించి మరీ విడాకుల కోసం డిమాండ్ చేశారని ఆరోపించడం సంచలనం రేపింది.
దీనికి ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేష్ సైతం బదులిచ్చారు. మరోవైపు పవిత్ర కూడా బెంగళూరు నుంచి మీడియాతో మాట్లాడింది. నరేష్‌తో తన స్నేహం, ఇతర విషయాలపై వివరణ ఇచ్చింది. నరేష్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనొక నిఖార్సయిన జెంటిల్మేన్ అని ఆమె కితాబిచ్చారు. నరేష్ తన జీవితంలో జరిగిందంతా తనకు చెప్పారని.. తమ మధ్య ఏ దాపరికాలూ లేవని ఆమె అన్నారు. ప్రస్తుతం తాను నరేష్‌కు తోడుగా ఉంటున్నానని పవిత్ర చెప్పారు. నరేష్ వ్యక్తిగత విషయాలు ఆయనే చూసుకుంటారని.. అలాగే తన వ్యక్తిగత విషయాలు తాను చూసుకుంటున్నానని.. తమ మధ్య ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఉందని పవిత్ర వివరణ ఇచ్చింది.
నరేష్‌తో గొడవలు ఉంటే రమ్య హైదరాబాద్‌లో చూసుకోవాలని.. కానీ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇక భర్తగా అందరూ భావిస్తున్న సుచేంద్ర గురించి ఆమె వివరణ ఇచ్చింది. సుచేంద్రతో తాను సహజీవనం మాత్రమే చేశానని.. ఆయన తన భర్త కాదని.. మరి ఆయనకు విడాకులు ఇచ్చే ప్రశ్న ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. వికీ పీడియాలో పవిత్ర భర్తగా ఇప్పటికీ సుచేంద్ర పేరు ఉండగా.. ఆయన్ని తాను పెళ్లి చేసుకోలేదని, 2017 నుంచి తాను ఆయనకు దూరంగా ఉంటున్నానని పవిత్ర స్పష్టం చేసింది.
This post was last modified on July 2, 2022 4:42 pm
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణను…
అదేమీ పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో నటించిన సినిమా కాదు. పోనీ దర్శకుడికి ప్యాన్ ఇండియాలు తీసిన అనుభవం…
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…