Movie News

మారుతి మారాల్సిందే

తక్కువ టైంలో అగ్ర దర్శకుడిగా ఎదిగిన దర్శకుల్లో మారుతి ఒకడు. చిన్న చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చోటు సంపాదించుకున్నాడు. 5D కెమెరాతో ‘ఈరోజుల్లో’ లాంటి చిన్న సినిమా తీసి హిట్టు కొట్టి ఎందరికో స్ఫూర్తి నిచ్చాడు మారుతి. ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రం’ తీసి హారర్ కామెడీ జోనర్ కి తెలుగులో మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసి తనని మిగతా దర్శకులు కూడా ఫాలో అయ్యేలా చేశాడు. మతిమరుపు , అతి శుభ్రత వంటి పాత్రలతో హిలేరియస్ గా నవ్వించాడు. ఇదంతా ఒకప్పుటి మారుతి ఘనత. ఇప్పుడు తన గ్రాఫ్ అమాంతంగా కిందకి దించేసుకున్నాడు. వరుసగా నాసిరకం సినిమాలు డెలివరీ చేస్తూ ఫ్లాపులతో సతమవుతున్నాడు.

‘ప్రతి రోజు పండగే’ సినిమాలో చావు మీద కామెడీ చేసి పాస్ మార్కులు అందుకున్న మారుతికి ఆ సినిమా సక్సెస్ అయ్యే సరికి ఇక తను తీసిన కామెడీ సినిమాలను జనాలు నెత్తిన పెట్టుకొంటున్నారనే ఫీలింగ్ వచ్చేసినట్టుంది. అక్కడి నుండి బ్యాక్ టు బ్యాక్ రొటీన్ కామెడీ సినిమాలు తీస్తూ మూస ధోరణిలో వెళ్తున్నాడు. ప్రతి రోజు పండగే తర్వాత మారుతి డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులొచ్చాయి’ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. మారుతి నుండి అంతో ఇంతో కామెడీ ఊహించి థియేటర్స్ కెళ్లిన వారిని సీట్లో కూర్చుబెట్టి తన పూర్ రైటింగ్ తో లేకి కామెడీతో బాగా ఇబ్బంది పెట్టాడు. దాంతో మార్నింగ్ షోకే ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీని నమ్ముకున్న కొందరికి ఉపాధి కల్పించడం కోసమే ఆ సినిమా తీశానని తమకి మంచి రోజులొచ్చాయి ప్రాఫిట్ ప్రాజెక్ట్ అని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు. కేవలం ఇరవై రోజుల్లో రాసిన కథతో తీశానని కూడా చెప్పుకున్నాడు మారుతి. నిజానికి ఆ సినిమాతో మారుతి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. దాంతో ‘పక్కా కమర్షియల్’ మీద ఆ ఎఫెక్ట్ బాగా పడింది. ఏదైనా హిట్ తర్వాత వచ్చే సినిమాకి క్రేజ్ ఉంటుంది కానీ ఇలా ఫ్లాప్ వెనుక వచ్చే మూవీ మీద జనాలకి మాత్రం ఏం ఆసక్తి ఉంటుంది. లాక్ డౌన్ లో కరోనా మీద సిల్లీ కామెడీతో చేసిన ప్రయోగం ముమ్మాటికి అతడి మిస్టేకే.

‘పక్కా కమర్షియల్’ విషయానికొస్తే అసలు ఈ సినిమా తీసింది మారుతినేనా ? అనిపించక మానదు. ‘మంచి రోజులొచ్చాయి’ అంటే ఇరవై రోజుల్లో హడావుడిగా వండిన రుచి పచి లేని వంటకం అనుకోవచ్చు. మరి గీతా ఆర్ట్స్ , యూవీ నిర్మించిన ఈ చిత్రానికి అంతా పక్కా అనుకున్నాకే సెట్స్ పైకి వెళ్లి ఉంటారు కాదా…స్క్రిప్ట్ మీద కొన్ని నెలలు వర్క్ చేసి ఆ తర్వాతే షూటింగ్ మొదలు పెట్టి ఉంటారు కదా.. డిస్కషన్స్ లో మిగతా అందరూ మారుతి చెప్పిన ప్రతీ దానికి సూపర్బ్ అనేశారా?

సినిమా చూసిన ఆడియన్స్ మారుతి రైటింగ్ స్కిల్స్ ఈ స్థాయికి పడిపోయాయా ? అనుకుంటూ బయటికి వస్తున్నారు. పైగా కొన్ని సార్లు హద్దులు మీరి మరీ జనాలను నవ్వించే ప్రయత్నం చేశాడు కూడా. సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా సీరియల్ యాక్టర్ గా నటించింది. ఓ సందర్భంలో లాయర్ పాత్ర కోసం ‘లా’ చదివానని ఒక డైలాగ్ చెప్తుంది. దానికి హీరో అంటే వ్యభిచారి కేరెక్టర్ వస్తే అంటూ పంచ్ వేస్తాడు. ఈ డైలాగ్ మారుతి లాంటి దర్శకుడు రాయడం దాన్ని క్లీన్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ వంటి హీరోతో చెప్పించడం ఎంత వరకూ సబబు ? ఇవన్నీ మారుతి ఆలోచించలేదా? లేదా నవ్వించడానికి ఏది బడితే అది రాసేయొచ్చని అనుకున్నారా? పూర్ రైటింగ్ తో ఇబ్బంది పెట్టే ఇలాంటి సీన్స్ ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇక సినిమాలో ఒక్క బలమైన సన్నివేశం కూడా లేకుండానే సిల్లీ కామెడీ తో నడిపించాలని చూసిన మారుతి ఐడియాలజీ చూసి నవ్వు రాక తప్పదు.

నెక్స్ట్ ప్రభాస్, చిరు వంటి బిగ్ స్టార్స్ అవకాశం ఇవ్వడానికి రెడీ అవుతుంటే ఈ దర్శకుడు ఇంకా లేకి కామెడీ సినిమాలు చేస్తూ తన గ్రాఫ్ ని తనే పడేసుకుంటున్నాడు. ఏదేమైనా ఒకప్పుడు మంచి కంటెంట్ తో హిట్ సినిమాలు డెలివరీ చేసి తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మారుతి ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో కిందా మీదా పడుతున్నాడు. ఇప్పటికైనా పర్ఫెక్ట్ అనాలసిస్ చేసుకోకపోతే ఇంకా డౌన్ అవ్వడం ఖాయం. నెక్స్ట్ ప్రభాస్ తో చేసే సినిమాకి తన బుర్రకు పదును పెట్టి మళ్ళీ మునపటి మారుతి లా ఆడియన్స్ ని మెప్పిస్తే టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి అలవోకగా వెళ్ళిపోతాడు. ఆపై చిరంజీవి తో ప్రాజెక్ట్ ఎలాగో ఉండనే ఉందిగా… సో తన రైటింగ్ మీదే డిపెండ్ అవ్వకుండా ఎవరైనా యంగ్ రైటర్స్ తో స్క్రిప్ట్ వర్క్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది.

Satya

Recent Posts

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

1 hour ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

2 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

3 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

4 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

6 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

6 hours ago