ఈ హీరోకు ఒక హిట్ పడితే బాగుండే అని ఆ హీరో అభిమానులు ఈ హీరో అభిమానులు అని తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులందరూ కోరుకున్నది అల్లరి నరేష్ విషయంలోనే అని చెప్పాలి. ‘అల్లరి’ మొదలుకుని ‘సుడిగాడు’ వరకు మన ప్రేక్షకులను అతను అంతగా నవ్వించాడు మరి. కాకపోతే ఆ కామెడీ కూడా మూసగా తయారవడంతో ప్రేక్షకులు అతడి సినిమాలను తిరస్కరించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి రెండేళ్ల కిందట వచ్చిన ‘నాంది’తో అల్లరోడు తాను కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు.
నరేష్ సినిమా బాగుందని టాక్ రాగానే.. ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వెళ్లి చూశారు. ఓటీటీలో సైతం ఈ చిత్రం బాగా ఆదరణ పొందింది. దీని తర్వాత ‘సభకు నమస్కారం’ అనే సినిమాను మొదలుపెట్టగా.. దాని నిర్మాత మహేష్ కోనేరు చనిపోవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఆపై నరేష్ లైన్లో పెట్టిన సినిమా.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ‘నాంది’ తరహాలోనే ఇది కూడా సీరియస్ మూవీలా కనిపించింది ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతన్న ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేసింది చిత్ర బృందం. అందులో ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ పడ్డ కష్టమంతా కనిపించింది. మారేడుమిల్లి అంటే ఏజెన్సీ ఏరియా. రియల్ లొకేషన్లలో షూటింగ్ అంటే అంత తేలిక కాదు. అడవులు, కొండల్లోకి వెళ్లి రోజూ షూట్ చేయడం అంటే చాలా కష్టమే ఉంటుంది. రోజూ షూటింగ్ సామగ్రి అంతా ఎత్తుకుని 250 మంది దాకా మూణ్నాలుగు గంటలు అడివిలోకి నడిచి వెళ్లి సన్నివేశాలు తీయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ వీడయోలో చూపించారు.
హిమాలయాల్ని గుర్తు చేసే వంజంగికి కూడా చిత్ర యూనిట్ ట్రెక్కింగ్ చేసి వెళ్లి షూట్ చేయడం విశేషం. తమ కష్టాన్ని దృశ్యాల రూపంలో చూపించి.. జూన్ 30న టీజర్ లాంచ్ అవుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో చూస్తే షూటింగ్‌లో ఇంత కష్టముంటుందా అనిపిస్తుంది అందరికీ. మరి ఈ కష్టానికి తగ్గ ఫలితాన్ని సినిమా అందిస్తుందేమో చూడాలి. ఏఆర్ మోహన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో నరేష్ సరసన ఆనంది నటించింది. రాజేష్ దండ నిర్మాత.
This post was last modified on June 29, 2022 10:48 am
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…