Movie News

త‌క్కువ రేట్లు.. ప‌బ్లిసిటీ గిమ్మిక్కా?

మా సినిమాకు టికెట్ల రేట్లు త‌క్కువ అని ప్ర‌చారం చేసుకుని సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది ఇప్పుడు. ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి కదా అని అయిన కాడికి రేట్లు పెంచేసుకోవ‌డం గ‌త ఏడాదితో పోలిస్తే 75-100 శాతం మ‌ధ్య రేట్లు పెరిగిపోవ‌డం.. అవి చాల‌వ‌న్న‌ట్లు పెద్ద సినిమాల‌కు అద‌నంగా వ‌డ్డిస్తుండ‌డంతో ప్రేక్ష‌కుల‌కు చిర్రెత్తుకొచ్చి థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేస్తుండ‌డం తెలిసిందే. ఈ నెగెటివ్ ట్రెండ్ అర్థ‌మై ఈ మ‌ధ్య కొన్ని సినిమాల‌కు టికెట్ల రేట్లు కాస్త త‌గ్గించారు.

మేజ‌ర్, విక్ర‌మ్ లాంటి చిత్రాల‌కు అది బాగా క‌లిసొచ్చింది కూడా. ఐతే ఈ విష‌యంలో గీతా ఆర్ట్స్ వాళ్లు మ‌రింత చొర‌వ తీసుకుని.. త‌మ నిర్మాణంలో తెర‌కెక్కిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రానికి ఇంకా రేట్లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ల‌లో 112, మ‌ల్టీప్లెక్సుల్లో 170కి అటు ఇటుగా రేట్లు ఉండ‌బోతున్న‌ట్లు ఈ సినిమా ప్రెస్ మీట్లో నిర్మాత బ‌న్నీ వాసు ఘ‌నంగా ప్ర‌క‌టించాడు.

దీని గురించి టాలీవుడ్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ఇలా రేట్లు త‌గ్గించ‌డం సినిమాకు ప్ల‌స్ అయి థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య పెరిగితే.. మున్ముందు మ‌రిన్ని చిత్రాలు ఈ బాట ప‌ట్టొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. కానీ ఇప్పుడు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. రేట్లు మునుప‌టిలాగే ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌లో 150, మ‌ల్టీప్లెక్సుల్లో 200 రేటు కొన‌సాగుతోంది.

హైదరాబాద్ ఏఎంబీలో అయితే 295 రేటునే అమ‌లు చేస్తున్నారు. మేజ‌ర్, విక్ర‌మ్ లాంటి చిత్రాల‌కు కూడా అక్క‌డ మాత్రం రేటు త‌గ్గించ‌లేదు. ఏపీలో కూడా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌కు ఇదే స్థాయిలో రేట్లు పెడుతున్న‌ట్లే ఉన్నారు. మ‌రి త‌మ చిత్రానికి రేట్లు అమాంతం త‌గ్గించేస్తున్న‌ట్లు అంత ఘ‌నంగా ప్ర‌క‌టించ‌డం కేవ‌లం పబ్లిసిటీ గిమ్మిక్కేనా.. లేక సాధార‌ణ రేట్ల‌నే కొన‌సాగిస్తుండ‌టం నిర్మాత‌ల దృష్టికి ఇంకా రాలేదా అన్న‌ది అర్థం కావ‌డం లేదు.

This post was last modified on June 27, 2022 9:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago