కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. పవర్ స్టార్ ఇమేజ్ ని మరింతగా పెంచేసింది ఆ సినిమా. ఇన్నేళ్ళయినా సినిమా ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో ‘ఖుషి’ టచ్ కనిపిస్తుంది. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సినిమా టీజర్ వదిలారు. టీజర్ చూస్తే ‘ఖుషి’ థీమ్ నే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది.
‘ఖుషి’ లో పవన్ , భూమిక లు ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ బయటపడరు. ఇగో లతో ఎక్కువగా మాట్లాడుకోరు. ‘రంగ రంగ వైభవంగా’ లో కూడా సేమ్ ఇదే లైన్ తీసుకున్నాడు దర్శకుడు. అంతే కాదు ఖుషి తరహాలోనే ఇందులో కూడా ఓ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ‘ఖుషి’ ని మక్కి కీ మక్కి కాదు కానీ ఇందులో ఓ మోస్తారు టచెస్ ఉండేలా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ సినిమాలో కొన్ని సార్లు పవన్ ని ఇమిటేట్ చేస్తాడని అంటున్నారు. అందులో ఓ ఎక్స్ ప్రెషన్ ఆల్రెడీ టీజర్ లో చూపించి పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.
ఏదేమైనా కొన్నేళ్ళ క్రితం యూత్ ని ‘ఖుషి’ చేసి కాలేజీల కంటే థియేటర్స్ లోనే ఎక్కువ గడిపేలా చేసిన సినిమాను అటు ఇటుగా మళ్ళీ కాస్త మార్పులతో వైష్ణవ్ చేస్తుండటం విశేషమే. సినిమా ఏ మాత్రం బాగున్నా వైష్ణవ్ కి హిట్టు పడినట్టే. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూడాలి మరి మావయ్య లా వైష్ణవ్ కూడా ఈ కాలేజీ లవ్ స్టోరీతో మంచి హిట్ కొడతాడేమో.
This post was last modified on June 27, 2022 6:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…