మెగాస్టార్ చిరంజీవి చేతిలో.. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలు మూడున్నాయి. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య (వర్కింగ్ టైటిల్), బోళా శంకర్.. ఇలా సమాంతరంగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు చిరు. అవి కాక యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు చిరు. ఇంకా చిరుతో కథా చర్చలు జరుపుతున్న వేరే దర్శకులు కూడా ఉన్నారు.
త్రివిక్రమ్‌తో కూడా ఆయనో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ సంగతేంటో ఇంకా తేలలేదు. ఈలోపు చిరు కొత్త సినిమాల జాబితాలో ఇంకో సినిమా చేరింది. ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన మారుతి చిరుతో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చిరునే వెల్లడించడం విశేషం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు ఈ మేరకు ప్రకటన చేశాడు.
యువి క్రియేషన్స్ భాగస్వాముల్లో ఒకరైన విక్కీ.. తన కొడుకు రామ్ చరణ్‌కు చాలా క్లోజ్ అని, అతను తన కుటుంబ సభ్యుడి లాంటి వాడని.. మారుతి దర్శకత్వంలో తనతో సినిమా చేయాలనుకుంటున్నట్లు అతను చెప్పడంతో తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చిరు వెల్లడించాడు. మారుతి తనకు సన్నిహితుడైన దర్శకుడని, ప్రజారాజ్యం రోజుల్లో పార్టీ జెండా రూపకల్పనతో పాటు, పాట చిత్రీకరణలోనూ కీలక పాత్ర పోషించాడని.. అతను దర్శకుడవుతాడని అప్పుడే అనుకున్నానని.. ఇప్పుడు అతను మంచి మంచి సినిమాలతో ఒక స్థాయి అందుకోవడం సంతోషంగా ఉందని చిరు చెప్పాడు. వేరే సినిమాలు చేస్తూనే తన సినిమా మీద ఫోకస్ పెట్టాలని మారుతికి స్టేజ్ మీది నుంచే చిరు సూచించడం విశేషం.
ఐతే ఇలా స్టేజ్‌ల మీద చిరు కొత్త సినిమాల గురించి సంకేతాలివ్వడం కొత్తేమీ కాదు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లతో సినిమాల గురించి కూడా గతంలో ఇలాగే మాట్లాడాడు. కానీ ఇప్పటిదాకా ఆ కాంబినేషన్లు వర్కవుట్ కాలేదు. మరి మారుతితో సినిమా గురించి యథాలాపంగా అన్నాడా.. నిజంగా సినిమా చేస్తాడా అన్నది చూడాలి. ఏదేమైనా పక్కా కమర్షియల్, ప్రభాస్‌తో చేయబోయే సినిమాల ఫలితాలను బట్టే చిరుతో జట్టు కట్టడం ఆధారపడి ఉంటుందన్నది స్పష్టం.
This post was last modified on June 27, 2022 9:12 am
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…