Movie News

సినిమా చేద్దామని యంగ్ హీరోను పిలిచి..

సినీ రంగంలో ఎవరి రాత అయినా మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అలా రాత మార్చుకున్నాక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక మంచి విజయం అందుకునే వరకు పడే కష్టాలు మామూలుగా ఉండవు. అందులోనూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి అందుకోవాలన్నా, గుర్తింపు తెచ్చుకోవాలన్నా చాలా కష్టమే పడాల్సి ఉంటుంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం కూడా అలాగే ఎన్నో కష్టాలు పడే ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బిజీ హీరో అయిపోయాడు.

ఇటీవలే ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. తన తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ విడుదలకు ముందే కాక తర్వాత కూడా తనకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పలేదని వెల్లడించాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్నాళ్లకు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్లు తనను పిలిచి సినిమా చేద్దాం అన్నారని.. దీంతో తాను చాలా సంతోషించానని.. కానీ వాళ్లు పారితోషకం ఇవ్వం, షూటింగ్‌కు రావడానికి కారు మాత్రం ఏర్పాటు చేస్తాం అన్నారని.. ఇదేంటని అంటే ఊరికే అందరూ హీరోలైపోరు అన్నారని కిరణ్ వెల్లడించాడు. హీరో అయ్యేదాకా పడేది ఒక కష్టం అయినా.. చిన్న హీరో అని ముద్ర పడడంతో ఎదురయ్యే కష్టాలు ఇంకో రకంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం అని కిరణ్ తెలిపాడు.

తనకు ఇలాంటి అనుభవాలు మరికొన్ని ఉన్నా వేటినీ సీరియస్‌గా తీసుకోలేదని.. తన అవకాశాలు తానే సృష్టించుకుని హీరోగా నిలదొక్కుకున్నానని.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తనతో పాటు చాలామంది జీవితాన్ని మార్చేసిందని కిరణ్ పేర్కొన్నాడు. మరే రంగంలో లేని నెగెటివిటీ సినిమా రంగంలో తాను చూశానని.. తాను ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చానని తెలిసి ఇండస్ట్రీలో వాళ్లే చాలామంది తిట్టారని.. పెద్ద హీరోలు, దర్శకులు తప్పితే మిగతా వాళ్లందరూ కూడా తమ పిల్లల్ని సినిమాల్లోకి రావద్దని చెబుతారని కిరణ్ అన్నాడు.

This post was last modified on June 26, 2022 1:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago