జూన్ నెల ఆరంభంలో ఫిలిం ఇండస్ట్రీలో జోష్ మామూలుగా లేదు. ఒక వీకెండ్లో ఒక సినిమా బాగా ఆడితేనే ఎంతో సంతృప్తి చెందే పరిస్థితుల్లో రెండు సినిమాలు సూపర్ హిట్టయి అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకు అమితానందాన్ని కలిగించాయి. జూన్ 3న రిలీజైన అడివి శేష్ సినిమా ‘మేజర్’, కమల్ హాసన్ మూవీ ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్లయ్యాయి. రెండూ వైవిధ్యమైన నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు కావడం, ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వడంతో బాక్సాఫీస్ కళకళలాడింది ఆ వారం. ఆ చిత్రాలు తర్వాతి వారాల్లోనూ నిలకడగా వసూళ్లు సాధించాయి. నెల చివరికి వచ్చినా ఇంకా వాటికి ఆదరణ దక్కుతుండడం విశేషం.
జూన్ నెలలో మిగతా వారాలకు కూడా మంచి మంచి సినిమాలే షెడ్యూల్ అయ్యాయి కానీ.. అవేవీ కూడా ప్రేక్షకారణ పొందలేదు. జూన్ 10న మంచి అంచనాల మధ్య వచ్చిన నాని సినిమా ‘అంటే సుందరానికీ’ డీసెంట్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తర్వాతి వారం ‘విరాటపర్వం’కు కూడా మంచి బజ్ కనిపించినా, టాక్ కూడా బాగున్నా అది కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. డిజాస్టర్‌గా మిగిలింది. సత్యదేవ్ సినిమా ‘గాడ్సే’ సైతం ఏ ప్రభావం చూపించలేదు. ఇక ఈ వారం సంగతి సరే సరి. పేరుకేమో అరజడనుకు పైగా రిలీజయ్యాయి. వాటిలో ఒక్క ‘సమ్మతమే’ మాత్రమే కాస్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. దీనికి కూడా టాక్ అంతంతమాత్రంగానే ఉంది. కాకపోతే ఉన్న సినిమాల్లో ఇది కాస్త నయం అంటున్నారు.
ఐతే ఈ వారం బాక్సాఫీస్‌లో సందడైతే కనిపించేలా లేదు. మొత్తంగా జూన్ నెల గొప్పగా ఆరంభమై పేలవంగా ముగిసింది. మళ్లీ బాక్సాఫీస్‌లో స్లంప్ కనిపిస్తుండగా.. వచ్చే వారం రాబోతున్న మారుతి సినిమా ‘పక్కా కమర్షియల్’ మీద ఇండస్ట్రీ ఆశలు నిలిచి ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అన్నీ పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గరా అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. మారుతి తన మార్కు వినోదాన్ని అందిస్తే ఈ చిత్రం పెద్ద హిట్టయ్యేందుకు, గోపీచంద్ కరవు తీర్చేందుకు అవకాశాలున్నాయి. ఈ అడ్వాంటేజీని మరింతగా క్యాష్ చేసుకోవడానికి ఈ చిత్రానికి సాధారణ స్థాయి కంటే టికెట్ల ధరలు తగ్గిస్తూ తెలివైన నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం. చూద్దాం మరి.. ‘పక్కా కమర్షియల్’ కమర్షియల్‌గా ఎలాంటి ఫలితం రాబడుతుందో?
This post was last modified on June 25, 2022 3:18 pm
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…