బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్లను అవకాశం వచ్చినపుడుల్లా ఎలా ఆకాశానికి ఎత్తేస్తుంటాడో తెలిసిందే. ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. హీరోలను పొగిడితేనే వాళ్లకు నచ్చుతుంది, వాళ్లతో సినిమాలు చేయాలంటే పొగడాలి కదా అన్నట్లు మాట్లాడాడు. మరి హీరోల విషయంలో అంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించే బండ్ల.. ఇటీవల చోర్ బజార్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
డైలాగ్ చెప్పడం రాని, డ్యాన్స్ చేయడం రాని హీరోలను పూరి జగన్నాథ్ తన డైలాగులతో స్టార్లను, సూపర్ స్టార్లను చేశాడని.. పెద్ద పెద్ద హిట్లిచ్చాడని వ్యాఖ్యానించాడు. అలాగే పూరి వల్ల హిట్లు కొట్టిన స్టార్లు ఆయన కొడుకు హీరోగా సినిమా చేస్తే ప్రమోట్ చేయడానికి ముందుకు రావట్లేదని వ్యాఖ్యానించాడు.
బండ్ల వేదికలెక్కినపుడు ఆవేశంతో ఊగిపోవడం, తన స్పీచ్ సూపర్ హిట్టయ్యేలా పంచులు వేయడం మామూలే. ఇందుకోసం బాగానే ప్రిపేరై వస్తాడతను. అలా అని కేవలం పబ్లిసిటీ కోసం బండ్ల చోర్ బజార్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని అనుకోవట్లేదు. అతడి తీరు ప్రకారం చూస్తే తనిలా హీరోలను టార్గెట్ చేయడు. ఇవేమీ యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు కావన్నది బండ్ల గురించి ఎరిగిన వాళ్లు అంటున్నారు.
కొన్నేళ్ల నుంచి సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల.. మళ్లీ ప్రొడక్షన్ మొదలుపెడదామనుకుంటున్నాడు. ముందుగా పవన్‌తో సినిమా ప్లాన్ చేశాడు కానీ.. ఆయన ఓకే అన్నట్లే అని తనకు ఖాళీ లేకపోవడంతో బండ్లకు డేట్లు ఇవ్వలేదు. మరోవైపు మిగతా స్టార్లంతా కూడా బిజీ బిజీగా ఉన్నారు. బండ్ల ఎవరిని సంప్రదించినా పనవ్వట్లేదు. కథ కంటే ముందు కాంబినేషన్లు సెట్ చేయడం, హీరో డేట్లు పట్టుకుని మిగతా వ్యవహారాలు చూడడం బండ్లకు అలవాటు. కానీ ఇప్పుడు అతడి ప్లాన్లేవీ వర్కవుట్ కావట్లేదు. స్టార్ హీరోలెవరూ అతడికి డేట్లివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే బండ్ల ఇలా తన ఫ్రస్టేషన్‌ను చూపించాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
This post was last modified on June 25, 2022 9:49 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…