ఆచార్య తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ వెంటనే ఒక బ్లాక్ బస్టర్ వస్తే తప్ప శాంతించేలా లేరు. వరసగా మూడు నాలుగు సినిమాలను సెట్ల మీద పెట్టేసి చిరంజీవి నాన్ స్టాప్ బిజీగా ఉన్నారు కానీ రిలీజుల విషయంలో మాత్రం స్పష్టత లేకుండా వ్యవహరించడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ వాల్తేర్ వీరయ్య 2023 సంక్రాంతి అని చెప్పేశారు. టైటిల్ అఫీషియల్ గా చెప్పకపోయినా పలు సందర్భాల్లో మెగాస్టార్ తో పాటు డైరెక్టర్ బాబీ చాలా స్పష్టమైన లీక్ ఇచ్చేశారు.
సరే ఇది రైట్ టైం ఎంచుకుందనుకుంటే మరి గాడ్ ఫాదర్ సంగతేంటి. ఇప్పటిదాకా లోగో రివీల్ చేయడం తప్ప ఏ చిన్న అప్ డేట్ లేదు. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన బాలకృష్ణ 107 ఆల్రెడీ రెండు మూడు పోస్టర్లు వచ్చేశాయి. క్రమం తప్పకుండా దాని గురించి టాక్ ఉండేలా సోషల్ మీడియాలో జాగ్రత్త పడుతున్నారు. కానీ గాడ్ ఫాదర్ సౌండ్ మాత్రం లేదు. కనీసం ఫస్ట్ లుక్ లాంటిది ఇచ్చే ఆలోచన చేయలేదు. ఒకవేళ దసరా రిలీజ్ అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే యాక్టివ్ పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాలి.
ఇంకా సల్మాన్ ఖాన్ తో పాట బ్యాలన్స్ ఉంది. ఏడు వందల మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ప్లాన్ చేస్తున్నారు కానీ ఎప్పుడనేది తెలియదు. మరోవైపు భోళా శంకర్ కూడా చిత్రీకరణ చేసుకుంటోంది. నిన్నటి నుంచి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ మొదలుపెట్టారు. షూట్ల సంగతి ఎలా ఉన్నా ఆచార్య విషయంలో జరిగిన నిర్లక్ష్యం గాడ్ ఫాదర్ కి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు యూనిట్ల మీద ఉంది. అసలే మెగా లైనప్ మీద చిరు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న తరుణంలో ఇకపై జాగ్రత్తగా ఉండకపోతే కష్టం.
This post was last modified on June 24, 2022 10:11 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…